బూందీ కూర తయారీ ఎలా?

Update: 2019-06-07 12:30 GMT

కావలసిన పదార్ధాలు :

పుల్లటి పెరుగు -అర కిలో

శెనగపిండి -300గ్రాములు

బూందీ -100గ్రాములు

కరివేపాకు -2 రెబ్బలు

నూనె -3 చెంచాలు

కారం -1 చెంచా

నల్ల ఆవాలు -1 చెంచా

గరంమసాలా -1 చెంచా

పసుపు -అర చెంచా

ఉప్పు -సరిపడా

తయారీ విధానం :

గిన్నెలో పెరుగువేసి దానికి శెనగపిండిని ఉండలు లేకుండా కలపాలి. ఈ మిశ్రమానికి పసుపు, ఉప్పు, కారం, గరంమసాలా కూడా కలిపి ఉంచాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనెవేయాలి. నూన కాగిన తర్వాత ఆవాలు, కరివేపాకు కలిపాలి..అందులో శెనగపిండి మిశ్రమం కలిపి ఉడికించాలి. ఉడుకుతున్నంతసేపు ఉండలు కట్టకుండా గరిటతో కలుపుతూ ఉండాలి. సన్నని మంటమీద అరగంట ఉడికించాలి. చిక్కటి మిశ్రమం అయిన తర్వాత బూందీ కలిపి దించాలి. పది నిమిషాల తర్వాత పుల్కాలతో వడ్డించాలి. 

Tags:    

Similar News