ఆరోగ్యానికి అరటికాయ పప్పు

Update: 2019-06-04 11:43 GMT

పచ్చి అరటికాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. పచ్చిఅరటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న అరటిని రోజుకి ఒకటైన తినటం అలవాటుగా మార్చుకుంటే ఎన్నో వ్యాధులు రాకుండా చెక్ పెట్టచ్చు.

కావలసిన పదార్ధాలు ‌:

అరటికాయలు - రెండు

సెనగపప్పు - 100 గ్రాములు

పచ్చిమిర్చి - ఆరు

కారం పొడి - మూడు టీ స్పూన్లు

నూనె, ఉప్పు తగినంత

ఉల్లిపాయలు - రెండు

తయారీ విధానం :

నానబెట్టిన సెనగపప్పునుగానీ కందిపప్పును గానీ పచ్చిమిర్చి, ఇంగువ పొడులను కలిపి మిక్సిలో రుబ్బి పక్కన పెట్టుకోవాలి. అరటికాయలను ఉడికించి ముందుగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ను వెలిగించి కడాయి పెట్టుకోవాలి..కడాయి వేడెక్కిన తర్వాత అందులో నూనె పోయాలి..నూనె కాస్త మరిగిన తరవుాత ఆవాలు వేయాలి. ఆవాలు చిటపటలాడిన తరువాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి..ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగనివ్వాలి. తరువాత పప్పు ముద్దను కూడా వేసి కలుపుకోవాలి. ఉడికించిన అరటికాయ ముక్కలను ఇందులో వేయాలి...నీటిని పోసి ఉడికించాలి..అరటికాయ పప్పు కూర రెడీ. 

Tags:    

Similar News