వాళ్ళను అర్ధం చేసుకోండి..

Update: 2019-08-06 13:50 GMT

నేటీ జీవిన విధానంలో ప్రతిది ఎక్ప్‌పెన్సివే, లైఫ్ సాఫిగా సాగలంటే భార్యాభర్తాలు ఇద్దరూ కష్టపడాల్సిందే లేదంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. దీంతో ఆర్థికంగా వచ్చే అవసరాలను అధిగమిస్తున్నా అయితే అవి కొత్త కష్టాలను క్రియేట్ చేస్తున్నాయి. పనుల ఒత్తిడితో ఇద్దరి మధ్య కోపతాపాలు పెరుగుతున్నాయి. ఇది ఇద్దరి మధ్యా దూరాన్నీ కూడా పెంచుతోంది.భార్యభార్యాలు ఇద్దరు ఈ విషయంపై దృుష్టి పెట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సమన్వయంతో ముందుకు సాగితే సమస్యలుండవంటున్నారు నిపుణులు.

సంసార బంధంలో ఒకరి పట్ల ఒకరికి బాధ్యతా ఉండాలి. ఇంటిపనైనా, ఆఫీసు ఉద్యోగమైనా ఎవరిస్థాయికి వారికవే ఎక్కువ అని మరిచిపోకుండా ప్రవర్తించండి. అవతలివారి చూసి వారిలో మనం ఉండాలి అనుకోవడమే అసలు దంపతుల మధ్య సమస్యలకు మూలం అంటోంది ఓ అధ్యయనం. అందరికి ప్రత్యేకమైన అభిరుచులు, ఇష్టాయిష్టాలు ఉంటాయి. కావున వాటిని మీరు గుర్తించకపోయినా ఫరవాలేదు కానీ అవమానించొద్దు. మీకు అభిప్రాయాలనే ఎదుటివారిపై రుద్దలనుకోవడం ఏ మాత్రం సరికాదు. అవతలివారి లోపాల్ని కూడా పదే పదే ఎత్తిచూపడమూ మంచిది కాదు. దీన్నివల్ల గొడవలు కారణం అయి బంధం మరింతగా జటిలం మారుతుంది.

ఉద్యోగాలు చేస్తూ, ఎన్నిపనులున్నా సరే ఇద్దరూ కలిసి ఒకరి కోసం ఒకరు కొంత సమయం కేటాయించుకోవాలి. సమస్యలు ఎన్నున్నా ఇద్దరూ తమకంటూ ఖాళీ సమయాన్ని ఉంచుకోవాలి, దీని వల్ల ఇద్దరి మధ్య స్పష్టమైన భావవ్యక్తీకరణ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అలాగే మీ భాగస్వామిని ఎవరికైనా పరిచయం చేస్తున్నప్పుడు వారి ప్రత్యేకతలను ఎదుటివారికి చెప్పాలి. తద్వారా ఒకరిపై ఒకరికి ప్రేమ పెరుగుతుంది. ముఖ్యంగా కుటుంబంలో ఆహ్లదంగా గడుపుతుండాలి. నవ్వుతూ సంతోషంగా గడుపుతూ ఉండడం వలన భార్యాభర్తలు ఇద్దరూ కలకాలం సంతోషంగా ఉంటారని అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Tags:    

Similar News