Energy Boost : బద్ధకం మీ ఇంటి పేరా? అయితే ఈ ఫుడ్స్ తింటే మీరు సూపర్ మ్యాన్ అయిపోవాల్సిందే
Energy Boost : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నీరసం, ఆలస్యం.
Energy Boost : బద్ధకం మీ ఇంటి పేరా? అయితే ఈ ఫుడ్స్ తింటే మీరు సూపర్ మ్యాన్ అయిపోవాల్సిందే
Energy Boost : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నీరసం, ఆలస్యం. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో తెలియని నిస్సత్తువ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సరిగ్గా తిండి తినకపోవడం, జంక్ ఫుడ్ అలవాట్లు, పోషకాహార లోపం వల్ల శరీరం లోపల బలహీనపడిపోతోంది. ఎంత విశ్రాంతి తీసుకున్నా అలసట తగ్గడం లేదని బాధపడేవారు తమ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే రోజంతా గుర్రంలా పరిగెత్తవచ్చు.
చియా సీడ్స్ : చియా విత్తనాలను ఎనర్జీ పవర్‌హౌస్ అని పిలుస్తారు. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా కండరాల అలసటను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులోని ఐరన్, మెగ్నీషియం బలహీనతను దూరం చేస్తాయి. చియా విత్తనాలను నీటిలో నానబెట్టుకుని తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీనివల్ల నీరసం త్వరగా తగ్గిపోతుంది.
అరటిపండు : మీరు బాగా అలసిపోయినప్పుడు ఒక్క అరటిపండు తింటే చాలు, వెంటనే శక్తి వస్తుంది. ఇందులో ఉండే గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు సుక్రోజ్ శరీరానికి తక్షణ ఊపును ఇస్తాయి. అరటిపండులో ఉండే పొటాషియం కండరాల నొప్పులు, తిమ్మిర్లను తగ్గిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ బి6 మెటబాలిజంను మెరుగుపరిచి మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచుతుంది.
బాదం, వాల్‌నట్స్ : బాదం పప్పుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు ఉంటాయి. బాదంలోని మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేసి నీరసాన్ని తగ్గిస్తుంది. ఇక వాల్‌నట్స్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మానసిక ఒత్తిడిని, అలసటను దూరం చేస్తాయి. ప్రతిరోజూ ఉదయాన్నే నానబెట్టిన బాదం, వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది మరియు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
ఓట్స్ : బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవడం వల్ల రోజంతా అలసట లేకుండా ఉండొచ్చు. ఓట్స్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు శరీరానికి నెమ్మదిగా, స్థిరంగా శక్తిని విడుదల చేస్తాయి. ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఐరన్ మరియు విటమిన్ బి శరీరంలోని నరాల వ్యవస్థను బలోపేతం చేసి శారీరక, మానసిక అలసటను తగ్గిస్తాయి.
గ్రీన్ టీ : ఎక్కువ పని ఒత్తిడి వల్ల కలిగే నీరసాన్ని వదిలించుకోవడానికి గ్రీన్ టీ ఒక అద్భుతమైన మార్గం. ఇది కేవలం శక్తిని ఇవ్వడమే కాకుండా, మెదడు ఏకాగ్రతను పెంచుతుంది. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. కెఫీన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలకు బదులు గ్రీన్ టీ తాగడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చు. ఈ ఆహార పదార్థాలను మీ జీవనశైలిలో భాగం చేసుకుంటే బద్ధకం మీ దరిచేరదు.