జుట్టు తెల్లబడిపోతుందా?

Update: 2019-07-31 15:35 GMT

ఇప్పుడు చాలా మందిలో చిన్నతనంలోనే జుట్టు తెల్లబడిపోతుంది. దీనికి ముఖ్య కారణం అనారోగ్య సమస్యలు, సరైన పోషకాలు లేని ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్య తలేత్తుంది. దీన్ని అధిగమించడానికి కృత్రిమంగా తయారయన ఉత్పత్తులు ఆశ్రయిస్తున్నాం. అయితే వాటి వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి. అలాకాకుండా సహజంగా లభించే పదార్థాలతో తెల్లజుట్టు సమస్యను నివారించుకోవచ్చు.

కొబ్బరినూనెలో నిమ్మరసాన్ని కలిపి రోజు తలకు రాసుకుంటే తెల్లగా ఉన్న జుట్టు నల్లగా మారుతుంది. అదేవిధంగా తెల్లజుట్టు రాకుండా కూడా ఉంటుంది. అలాగే ఉసిరి పొడిని నిమ్మరసాన్ని కలిపి పేస్టు మాదిరిగా చేసుకోవాలి. దాన్ని రోజు తలకు రాసుకుని రెండు గంటల వరకు ఆగి తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తెల్లజుట్టు నల్లగా మారిపోతుంది. ఉల్లిపాయిల పరిష్కారనికి చక్కగా పనిచేస్తుంది. ఉల్లిపాయను మెత్తగా మిక్సీ చేసి. ఈ పేస్టును తెల్ల వెంట్రుకలు ఉన్న చోట రాయాలి. రెండు గంటల తరువాత షాంపూతో స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన తెల్లజుట్టు సమస్య పోతుంది ..రోజు క్యారెట్ జ్యూస్ తాగడం వలన కూడా జుట్టు నల్లబడుతుంది. అంతేకాకుండా రోజూవారి ఆహారంలో విటమిన్స్, ప్రోటీన్స్, బి12 ఎక్కువగా ఉండాలి.

Tags:    

Similar News