గంజాయి మత్తు శరీరంలో ఎంత సమయం ఉంటుంది.. పరిశోధనలో షాకింగ్ నిజాలు..!
గంజాయి మత్తు శరీరంలో ఎంత సమయం ఉంటుంది.. పరిశోధనలో షాకింగ్ నిజాలు..!
గంజాయి మత్తు శరీరంలో ఎంత సమయం ఉంటుంది.. పరిశోధనలో షాకింగ్ నిజాలు..!
Effects of Cannabis: ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో గంజాయిని తీసుకోవడంపై నిషేధం ఉంది. ఇది ఒక మత్తుమందు. గంజాయి ఒక వ్యక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఒక పరిశోధన చేశారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అధ్యయనంలో శాస్త్రవేత్తలు 80 పరిశోధనా పత్రాలను రీసెర్చ్ చేసి తదనుగుణంగా ఫలితాలని వెల్లడించారు.
గంజాయి వివిధ వ్యక్తులపై వివిధ రకాల ప్రభావాలను చూపుతుంది. గంజాయి ప్రభావం అనేది వ్యక్తి సామర్థ్యం, ఆహారం, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి గంజాయిని తీసుకుంటే టెట్రాహైడ్రోకానాబినాల్ (THC) అనే రసాయనం అతని శరీరంలో చాలా వారాల పాటు ఉంటుంది. ఇది మత్తు కలిగించే ఒక రసాయన పదార్థం. ఒక వ్యక్తిని కొన్ని గంటలు మాత్రమే మత్తులో ఉంచగలిగినప్పటికీ దాని ఉనికి చాలా కాలం పాటు శరీరంలో ఉంటుంది.
80 రకాల అధ్యయనాలను విశ్లేషించిన తరువాత శాస్త్రవేత్తలు గంజాయి మత్తు 3 నుంచి 10 గంటల వరకు ఉంటుందని కనుగొన్నారు. గంజాయిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే గరిష్టంగా 10 గంటలపాటు మత్తులో ఉండేందుకు వీలుంటుందని తేల్చారు. న్యూరోసైన్స్, బయోబిహేవియరల్ రివ్యూస్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజూ గంజాయిని తీసుకునే కొందరు వ్యక్తులు మత్తులో తమ పనిని చేసుకోగలుగుతారు. అందువల్ల గంజాయి ఒక వ్యక్తిని ఎంతకాలం మత్తులో ఉంచగలదో చెప్పడం కొంచెం కష్టం. అయినప్పటికీ దాని ప్రభావం కనీసం 5 గంటలు ఉంటుందని చెప్పవచ్చు.