మొబైల్ ఫోన్ మీ చర్మాన్ని ఎలా దెబ్బతీస్తుందో తెలుసా?

Update: 2019-06-05 16:57 GMT

పబ్లిక్ టాయిలెట్ పోలిస్తే మొబైల్ ఫోన్లపై ఎక్కువ బాక్టీరియా ఉండే అవకాశాలు ఉన్నాయని పలు పరిశోధనాలు వెల్లడించాయి. అందువల్ల ఫోన్ శుభ్రత పాటించడం చాలా ముఖ్యం. లేకపోతే, ఫోన్ మీదుండే బాక్టీరియా చెమట, నూనెతో చర్మంతో కలిసి పోయి చర్మంపై బ్రేక్ ఔట్స్ ఏర్పడే ప్రమాదముంది.ఫోన్ లైట్ వలన ఎన్నో చర్మ సమస్యలు కూడా తలెత్తవచ్చని ఇటీవల జరిగిన ఎన్నో అధ్యయనాలు తెలుపుతున్నాయి. వాటిలో అకాల వృద్ధాప్యం కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన మూడు చర్మపు సమస్యలను తెలుకుందాం.

ఫోన్ గంటల తరబడి మాట్లాడడం వల్ల దవడ ఎముకులు, చెవులు, చేతులపై ఉండే చర్మం ఎర్రబడి, వాచిపోయే అవకాశాలు ఉన్నాయి.అంతే కాకుండా ఆయా ప్రదేశాలలో దురదలు, పొక్కులు ఏర్పడవచ్చు.. దీనిని మొబైల్ ఫోన్ డెర్మటైటిస్ అని అంటారు. మెుబైల్ ఫోన్‌లో ఉండే నికెల్, క్రోమియం వంటి లోహాలు వల్లే ఈ సమస్యలు ఏర్పడతాయి. ఇవి దాదాపు ప్రతి మొబైల్ ఫోన్ కేసింగ్స్ లో  ఉంటాయి. అందుకే ఫోన్ మాట్లాడుతున్నప్పుడు బ్లూటూత్ లేదా హెడ్ సెట్స్ లాంటి హాండ్స్ - ఫ్రీ పరికరాలను వాడడం మచింది.

చర్మంపై ముడతలు ఏర్పడడానికి కేవలం వయస్సు మాత్రమే కారణం కాదు. ఇరవై వయస్సులో ఉన్నవారు కూడా క్రో ఫీట్ అనే సమస్యతో బాధపడుతున్నారు. క్రో ఫీట్ వల్ల కళ్ళ చివరి ప్రదేశంలో ముడతలు ఏర్పడుతాయి. దీనికి కారణం ఎక్కువ సేపు ఫోన్ స్క్రీన్లను క్షుణ్ణంగా చూడడం, చిన్న చిన్న అక్షరాలను కూడా కళ్ళు చిన్నవి చేసుకుని మరీ చదవడం వల్ల క్రో ఫీట్ సమస్యలతో పాటు మెడ మీద అకాల ముడతలు ఏర్పడుతాయి. ఈ చర్మ సమస్యలు రాకుండా ఉండాలంటే... కళ్ళ స్థాయికి తగట్టుగా ఫోన్ ని పట్టుకోవడం మంచిది. దీంతో పాటు ఫాంట్ సైజుని కూడా పెంచుకోవాలి. ఫోన్ వల్ల అనేక రకాలుగా చర్మ సమస్యలు తలెత్తుతాయి.

Tags:    

Similar News