దగ్గు దగ్గలేకపోతున్నారా..!

Update: 2019-07-17 09:45 GMT

దగ్గు సమస్య.. ఇది వచ్చిన వారికే కాదు.. పక్కన ఉన్న వారికి కూడా ఓ సమస్యే. రాత్రి సమయంలో అయితే దగ్గు సమస్య నిద్ర సరిగా పట్టదు. ప్రతిసారి దగ్గటం వల్ల ఇంటిలో ఉండే వారికి నిద్ర పట్టకపోయే అవకాశం ఉంది. అయితే ఈ దగ్గును ఇంట్లోని కొన్ని ఆహార పదార్థాలతోనే తగ్గించుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* రెండు , మూడు వెల్లుల్లి రెబ్బలను బాగా నలిపి రెండు టీస్పూన్ల తేనెతో కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. వెల్లుల్లి ఉండే యాంటి బయోటిక్ గుణాలు రోగనిధకశక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.

* ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్‌లో చిటికెడు అల్లం పొడి,మిరియాల పొడిని కలిపి తాగితే దగ్గు తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

* ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో కొంత పసుపు ,కొద్దిగా వెల్లుల్లి మిశ్రమం కలిపి తాగిన దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

అయితే దగ్గు సమస్య వీపరీతంగా ఉంటే కూలింగ్ వాటర్ తాగటం మంచిది కాదు. వీలైనంత వరకు చల్లటి వాటర్ కు దూరంగా ఉండాలి. దాహం అయినప్పుడల్లా వేడి నీటిని కొంచెం తీసుకుంటూ ఉంటే.. దగ్గు నుంచి కొంచెం రిలీఫ్ గా ఉంటుంది. అయితే ఒక కప్పు నీటిలో 1/2 టీ స్పూన్ అల్లం రసం, కొద్దిగా టీ పొడి బాగా మరిగించాలి. తరువాత కొన్ని తులసి ఆకులను వేసి ఆ వాటర్ ని తాగితే దగ్గు నుంచి మంచి ఉపశమనం ఉంటుందంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News