అసిడిటీ సమస్య వేధిస్తోందా..?

Update: 2019-07-20 17:09 GMT

ప్రస్తుత కాలంలో అసిడిటీ ఎంతోమందిని వేధిస్తోన్న సమస్య. ఇది జీర్ణక్రియ సమస్యల్లో ఒకటి. అసిడిటీ వల్ల జీర్ణాశయంలోను, గుండెల్లోను, గొంతులోను, ఛాతీలోను మంటగా ఉంటుంది. పుల్లటి తేన్పులు వచ్చి ఆహరం గొంతువరకు వచ్చినట్లుగా అనిపిస్తుంది. సరైన ఆహార నియమాలని పాటించకపోవడం వల్ల, అసిడిటీ సమస్య తలెత్తవచ్చు. ఈ సమస్యని దూరం చేసే కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి.

కొబ్బరి నీళ్లు తాగడం వలన అసిడిటీతో కలిగే ఇబ్బందిని తగ్గించుకోవచ్చు. ఈ నీళ్ళల్లో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అసిడిటీ సమస్య ఉన్నప్పుడు కొబ్బరి నీళ్లను తాగడం మంచిది.

చల్లని పాలు తాగి కూడా అసిడిటీ సమస్య నుంచి రిలీఫ్ పొందవచ్చు. పాలలో ఉండే కాల్షియమ్ కడుపులో ఆసిడ్ బిల్డప్ కాకుండా చేయగలదు. అందువల్ల ఒక గ్లాసు చల్లటి పాలను తాగడమే అని నిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన తరువాత అసిడిటీ సమస్య వేధిస్తే ఒక గ్లాసు మజ్జిగ తాగడం మంచిది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ కడుపులో ఉండే అసిడిటీని మళ్ళీ సాధారణ స్థితికి తీసుకురాగలదు.

తులసి ఆకులతో కూడా అసిడిటీ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. , నాలుగు తులసి ఆకుల్ని ఒక కప్పు నీళ్ళల్లో కాసేపు వేడి చేసి. ఆ నీళ్ళను తరుచూ తాగాలి. ఇది అసిడిటీకి తగ్గించడంలో ఉత్తమ చిట్కాలలో ఒకటి.

Tags:    

Similar News