దగ్గు మరియు జలుబు బాధిస్తున్నాయా..!

Update: 2019-09-12 05:20 GMT

వ‌ర్షాకాలంలో మ‌న‌కు వ‌చ్చే అనేక వ్యాధుల్లో జ‌లుబు, ద‌గ్గు స‌హ‌జ‌మైన‌వి. ప‌లు ర‌కాల వైర‌స్‌ల వ‌ల్ల ఈ వ్యాధులు వ‌స్తాయి. వాతావరణం చల్లబడింది. ప్రతిరోజూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వర్షాకాలంలో మొదలయ్యే సీజనల్ వ్యాధులు కూడా నేనున్నానంటూ జనాలను పీడించేందుకు రెడీ అయ్యాయి.

ముఖ్యంగా జలుబు మరియు దగ్గు వలన కలిగే సమస్యలు మనల్ని మనశ్శాంతిని కలిగించవు. కొన్ని చిట్కాలు పాటిస్తే.. వీటి నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* పసుపు కలిపిన పాలు మన భారతదేశంలో ప్రాముఖ్యం పొందిన ఔషదంగా చెబుతారు ఆయుర్వేధ నిపుణులు. పాలలో ఒక చెంచా పసుపు కలుపుకొని తాగితే దగ్గు మరియు జలుబు నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* అల్లంతో చేసిన వేడి టీ తాగిన జలుబు మరియు దగ్గు నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది.

వేడి నీరు

* జలుబును తగ్గించుకోటానికి నీటిని తాగటం అనేది చాలా సులువైన పద్దతి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. గోరువెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో కలిగే ఇన్‌ఫక్షన్‌ను తగ్గిస్తుంది. రోజు మొత్తం వేడిగా ఉండే నీటిని తరచుగా తాగటం వలన మంచి జలుబు నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

* నిమ్మరసానికి కొన్ని చుక్కల తేనె మరియు దాల్చిన చెక్క పొడి కలిపి తయారు చేసిన సిరప్ జలుబు నుండి త్వరగా ఉపశమనం అందిస్తుంది. ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని రోజులో రెండు సార్లు తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. 

Tags:    

Similar News