అందమైన చర్మ సౌందర్యం కోసం ఆముదము..!

Update: 2019-07-23 11:30 GMT

టీనేజ్ లో చాల మందికి ముఖం పై మచ్చలు వస్తాయి. ఈ మచ్చలు అంత త్వరగా పోవు. అయితే ఇలాంటి సమస్యలకు ఆముదము ఎంతగానో ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. అలాగే ఆముదము జుట్టు పెరగడానికి ఎంతగానో సహాయపడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* వేడి చేసిన ఆముదము మీ జుట్టుకి పట్టించి, షాంపూతో స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు.

* జుట్టుకు కండీషనర్ గా కూడ ఆముదమును ఉపయోగించుకోవచ్చు. దీనిలోని కొవ్వు పదార్దములు జుట్టు పెరుగుదలకి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.

* ఆముదము పగిలిన వేళ్ళకు రాత్రి పూట పట్టించి నెక్ట్స్ రోజు శుబ్రం చేసుకుంటే మంచి ఫలితాలని పొందవచ్చు.

* ఆముదమును ఒంటికి పట్టించి 15 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే.. అందమైన, మెరిసే చర్మాన్ని ఇస్తుందంటున్నారు నిపుణులు.

* వేడి చేసిన ఆముదమును రాత్రి నిద్ర పొయేముందు పాదాలకు పట్టించి, ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే.. పగిలిన పాదాలనుండి విముక్తి లబిస్తుందట.

చర్మం పై.. గీతలు, మొటిమలు, మచ్చలు ఎలాంటి వాటికైన ఆముదము మంచి చికిత్సలా ఉపయోగపడుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆముదము చర్మాన్ని తేమగా ఉంచడానికి "చర్మం యొక్క మాయిశ్చ్చరైజర్" గా కూడా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు.  

Tags:    

Similar News