తెల్లవారుజామునే గుండెపోటు రావడానికి కారణం..

Update: 2019-07-03 13:34 GMT

చాలా మందికి తెల్లవారుజామునే గుండేపోటు వస్తుంది. అలా రావడానికి శరీర ధర్మానికి సంబంధించిన స్పష్టమైన కారణాలు ఉన్నాయి. ఉదయం రక్తప్రసరణ అత్యంత సునిశితంగా ఉండి..బాహ్యాంతర ప్రభావాలకు లోనవుతుంది. ఈ కారణంగా గుండేపోటు రావచ్చు.నిద్రలేవడానికి కొన్ని గంటల ముందు శరీరంలో అడ్రినలిన్‌ వంటి హార్మోన్ల ఉత్పత్తి అధికమవుతుంది. రాత్రంతా విశ్రాంతిలో ఉన్న శరీరం పగలు చేయాల్సిన పనులకు సిద్దమవుతున్న సమయంలో గుండె ఒత్తిడికి గురవుతుంది. ఇది హార్మోన్ల అధికోత్పత్తికి ఒక కారణమవుతుంది.

అడ్రినలిన్‌ హార్మోన్ల ఉత్పత్తి పెరిగినప్పుడు రక్తనాళాలు ముడుచుకుపోతాయి. దీంతో ధమనుల లోపల ఉన్న కొలెస్ట్రాల్‌లో పగుళ్లు ఏర్పడతాయి. ఇది గుండెపోటు రావడానికి కారణం అవోచ్చు. నాళల్లో రక్తం గడ్డకడితే దాన్ని కరిగించడానికి ఓ వ్వవస్థ ఉంటుంది. నిద్ర లేచిన సమయంలో ఈ వ్వవస్ధ చాలా నేమ్మదిగా ఉంటుంది. దీనివల్ల రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం అలాగే ఉండిపోవడంతో రక్తప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది. ఈ కారణంగా ఆక్సిజన్‌ అందకపోవడంతో గుండె నొప్పి రావడానికి కారణమవుతుంది. హర్ట్ ఆటాక్ వచ్చిన వేంటనే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే హాస్పిటల్‌కు తరలించాలి

Tags:    

Similar News