Health Tips: రాత్రి 7 గంటల లోపే భోజనం చేయాల్సిన అవసరం ఏంటి? ఆలస్యంగా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఇవే!
ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తింటున్నామన్నదానికంటే, అది ఎప్పుడు తింటున్నామన్నదికే ఎక్కువ ప్రాధాన్యత ఉందని నిపుణులు చెబుతున్నారు.
Health Tips: రాత్రి 7 గంటల లోపే భోజనం చేయాల్సిన అవసరం ఏంటి? ఆలస్యంగా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలు ఇవే!
ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి తింటున్నామన్నదానికంటే, అది ఎప్పుడు తింటున్నామన్నదికే ఎక్కువ ప్రాధాన్యత ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్ అనుపమ్ శైకియా గారు చెబుతున్నదేమిటంటే – రాత్రి భోజనాన్ని సాయంత్రం 7 గంటల లోపే పూర్తిచేయడం చాలా మంచిదని స్పష్టం చేశారు.
ఎందుకంటే...
1. జీర్ణవ్యవస్థ నెమ్మదించిపోతుంది
రాత్రి సమయంలో మన శరీరంలో జీర్ణక్రియ మందగిస్తుంది. అప్పుడు తీసుకునే ఆహారం సమర్థంగా జీర్ణం కాకపోతే,
అమ్లపిత్తం,
వాంతులు,
వాయువు,
పొట్ట నొప్పులు
వంటివి తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తీసుకునే ఆహారం నిద్రలో అంతరాయం కలిగించి, తదుపరి రోజంతా అలసటగా ఉండేలా చేస్తుంది.
2. శరీరభార పెరుగుదల
రాత్రి సమయంలో మెటబాలిజం బాగా మందగిస్తుంది. ఆలస్యంగా తీసుకునే భోజనం జీర్ణం కాకపోతే, దానిలోని క్యాలొరీలు కొవ్వుగా నిల్వ అవుతాయి. దీర్ఘకాలంలో ఇది ఊబకాయంకి దారితీయొచ్చు.
3. బ్లడ్ షుగర్ ప్రమాదం
రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తే, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశముంది. ఇది మధుమేహం, ప్రీ-డయాబెటిస్ సమస్యలవైపు దారి తీస్తుంది.
4. గుండె ఆరోగ్యానికి హాని
అలాగే, ఆలస్యంగా భోజనం చేయడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు, బీపీ, కోలెస్ట్రాల్ పెరుగుదల వంటి సమస్యలు రావచ్చు. రాత్రి సమయానికి సంబంధించి ఈ మార్పులు ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఉంటాయి.
అయితే ఏమి చేయాలి?
రాత్రి భోజనాన్ని సాయంత్రం 7 గంటల లోపు పూర్తిచేయడం ఉత్తమం.
తేలికపాటి, త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్నే తినాలి.
భోజనం తర్వాత నీరు తక్కువగా తీసుకొని, కొద్దిసేపు నడవడం మంచిది.
ఈ చిన్న మార్గదర్శకాలను పాటించితే, మధుమేహం, గుండెపోటు, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు. "ఆరోగ్యమే మహాభాగ్యం" అనే మాటను గుర్తుంచుకొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి.