గంజి వల్ల ఇన్ని ప్రయోజనాలా...

Update: 2019-09-04 05:45 GMT

అన్నం వండినప్పుడు వచ్చే గంజిని చాలా మంది అనవసరంగా బయటపడేస్తుంటారు. కానీ దాని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. గంజి నీటిలో చాలా పోషకాలు ఉన్నాయి. అది గోరు వెచ్చగా ఉన్నప్పుడు దానిలో కాస్తంత ఉప్పు వేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. నీరసంగా ఉన్నప్పుడు గంజిని త్రాగితే ఇన్‌స్టాంట్ ఎనర్జీ వస్తుంది. గంజి నీటిలో ఎక్కువ విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా వాటిలో బి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరానికి అవసరమయ్యే పోషణ లభిస్తుంది. అలాగే శరీరంతో విటమిన్ల లోపం రాకుండా జాగ్రత్తపడవచ్చు.

ముఖ్యంగా చిన్న పిల్లలకు గంజిని తాగిస్తే చాలా మంచిది. అది తాగడం వల్ల పోషకాలు అధికంగా లభిస్తాయి. వారికి శారీరక ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. పాలు సరిగా తాగని పసిపిల్లలకు కనీసం గంజి నీటినైనా తాగించాలి. దీంతో కావాల్సిన శక్తి వారికి సమకూరి శరీరానికి సరైనా శక్తి లభిస్తుంది. పోషణ సరిగ్గా ఉంటుంది. విరేచనాలు వాంతులతో బాధపడుతున్న వారు గంజి నీటిని తాగితే వెంటనే తగ్గుతాయి. చర్మంపై దురద వస్తుంటే ఆ ప్రదేశంలో కొద్దిగా గంజి నీటిని పోసి మర్దనా చేయాలి. ఫలితంగా దురదలు తగ్గిపోతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న గంజి నీటిని తాగడానికి ప్రయత్నిచండి. వాటిని వృథాగా బయట పోయకుండా ఉపయోగించుకోండి. వేడి వేడి గంజి తాగాలని అనిపించనప్పుడు. చల్లార్చైనా దానికి తాగండి.  

Tags:    

Similar News