సోంపూతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Update: 2019-07-09 15:37 GMT

మనం భోజనం చేసిన తర్వాత అది అరగడం కోసం సోంపూ తింటాం. ఆహారం జీర్ణమవడానికే కాదు పలు రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. సోంపూలో పీచు, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, పొటాషియం, మాంగనీసు వంటి పోషకగుణాలు ఉన్నాయి. వాటితో పాటు మరెన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.

వాటిలోని విటమిన్- సి రోగనిరోదక శక్తిని పెంచి కణాలను రీపేరు చేస్తుంది. అంతేకాకుండా హానికర ఫ్రీరాడికల్స్‌ను నియంత్రిస్తుంది. సోంపు అనేక రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

సోంపూ గింజల్లో యాంటీఆక్సీడెంట్ల వంటి ఔషద గుణాలు ఉన్నాయి. అవన్నీ యాంటీ క్యాన్సర్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు కలిగి ఉండడంతో అనేక రకములైన వ్యాధులను రాకుండా కాపాడుతాయి.

సోంపులోని పీచు హృద్రోగాలు వచ్చే ప్రమాదం తగ్గిస్తుంది. వాటిలోని పొటాషియం బీపీ పెరగకుండా కాపాడుతుంది.

రోజూ రెండు గ్రాముల సోంపు గింజలతో కషాయం చేసుకుని తాగడం వల్ల ఆకలి తగ్గుతుందట. అందులోని అనెతోలె అనే గాఢ తైలానికి ఆకలిని తగ్గించే గుణం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

సోంపులోని పోషకాలు బాలింతల్లో పాలు బాగా రావడానికి తోర్పడుతాయి

సోంపూ వృద్దాప్యాన్ని, మెనోపాజ్‌లో తలెత్తే సమస్యల్ని తగ్గిస్తుంది. కావున రోజూ వారీ ఆహారంలో కొంచెం సోంపు గింజల్ని ఏదో ఒక రూపంలో చేర్చుకోవడం చాలా మంచిది.

Tags:    

Similar News