పచ్చి కొబ్బరి వల్ల ఇన్ని ఉపయోగాలా..?

Update: 2019-06-20 13:47 GMT

పచ్చి కొబ్బరి అనగానే గుర్తుకు వచ్చేది.. చట్నీ. కొబ్బరిని నూరి చట్నీ చేస్తే.. అబ్బా ఆ రుచే వేరు. పచ్చి కొబ్బరిని సాధరణంగా వంటల్లో ఉపయోగిస్తు ఉంటారు. అయితే కొబ్బరిని నేరుగా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఆడవారికి థైరాయిడ్ సమస్యలు రాకుండా కొబ్బరి చేస్తుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కోవ్వును కరిగించటంలో కొబ్బరి చాలా బాగా సహాయపడుతుంది. శరీరంలో నీటిశాతం కోల్పోకుండా చేస్తుందంటున్నారు నిపుణులు. పచ్చి కొబ్బరిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన.. అవి గుండెకు ఎంతో మేలు చేస్తాయట.

కొబ్బరిలో ఉండే పీచు.. కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా పనిచేసేలా చేస్తుంది. బరువు తగ్గాలి అనుకొనే వారికి కొబ్బరి చాలా మంచిదట. కేరళలో కొబ్బరి ఎక్కవగా వాడుతుంటారు. బహుశా అందుకేనేమో కేరళ ప్రజలకు ఎక్కువ గుండె జబ్బులు రావని అభిప్రాయ పడుతున్నారు నిపుణులు.

కొబ్బరిని ఆహారంలో తీసుకునే వారికి మలబద్ధకం, థైరాయిడ్ సమస్యలు దరి చేరవట. నిత్యం వ్యాయామం చేసే వారికి, శారీర‌క శ్ర‌మ చేసే వారికి ప‌చ్చి కొబ్బ‌రి ఎంత‌గానో మేలు చేస్తుంది. అలాగే క్రీడాకారులకు ప‌చ్చి కొబ్బ‌రి తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. కొబ్బరి తినడం వ‌ల్ల శ‌క్తి వేగంగా అందుతుంది. దీంతో క్రీడకారులు మ‌రింత సేపు శ్ర‌మించినా పెద్ద అల‌స‌ట రాదంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News