కంటి ఆరోగ్యానికి బీట్‌రూట్‌

Update: 2019-07-26 11:02 GMT

వయసు పైబడుతున్న కొద్ది శరీరంలోని అవయవాలన్నీ ఒకొక్కక్కటిగా బలహీనపడుతూ ఉంటాయి. ప్రారంభంలో సమస్య తీవత్ర అంతగా కనిపించనప్పటికీ ,కాలక్రమేణ వ్యాధి ముదిరిపోతుంది. కొన్ని వ్యాధులు ముదిరినా తిరిగి చక్కదిద్దే అవకాశం ఉంటుంది కానీ, ఇంకొన్ని రకాల వ్యాధులు ముదిరిపోతే వాటిని చేయగలిగేది ఏమీ ఉండదు.

వాటిలో ప్రధానమైనది గ్లకోమా అనే కంటి జబ్బు. అది కాస్త ముదిరితే ఏం చేసినా ప్రయోజనం ఉండదు. ఆ జబ్బును మందులూ నయం చేయలేవు. సర్జరీతో చేసినా ఒరిగేదీ ఏమీ ఉండదు.కావున ఏదైనా వ్యాధి వచ్చి, అది ముదిరే దాకా చూసి అవస్థలూ పడోద్దు. ఆ జబ్బులు రాకుండానే చూసుకోవడం మేలు. వ్యాధులు రాకుండా చేసుకోవడానికి, ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రోజువారి ఆహార పదార్థాల్లో కాస్త జాగ్రత్త పడితే చాలు. వృధ్యాప్యంలో వచ్చే కంటి జబ్బులనే తీసుకుంటే, రోజూ ఆకుకూరలూ, బీట్‌రూట్‌ వంటి వాటిని రోజు వారీ అహారంలో తీసుకుంటే దృష్టిలోపం ఉండదు. అలాగే మాక్యులర్‌ డీజనరేషన్‌ అనే వ్యాధిరాకుండా జాగ్రత్తపడవచ్చు. కంటి అరోగ్యానికి నత్రజని ఉన్న ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిదిపాలకూరలో నత్రజని ఎక్కువగా ఉంటుంది.అలాగే బీట్‌రూట్‌లో ప్రతి వంద గ్రాములో 15 గ్రాముల నత్రజని ఉంటుంది. కావున వీటిని ఆహరంతో తగిన మెుత్తంలో తీసుకుంటే కంటి సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. 

Tags:    

Similar News