పిల్లలు మొబైల్ వాడితే..!

Update: 2019-08-10 15:07 GMT

పిల్లలు ఆడుకునే గేమ్స్ గ్రౌండ్స్ నుంచి స్మార్ట్ మొబైల్స్ లోకి వచ్చాయి. ఇంతకు ముందు స్కూల్ అయిన వెంటనే పిల్లలు మైదానంలో ఆడుకోనే వాళ్లు. సరదాగా ఫ్రెండ్స్ తో ఆడుకోవడం కబుర్లు చెప్పడం చేసేవాళ్లు. కానీ ఇప్పుడు చాల మంది పిల్లలు గ్రౌండ్స్ లో ఆడుకునే ఆటలను స్మార్ట్ ఫోన్లో ఆడుకుంటున్నారు. స్కూల్ నుంచి వచ్చి రావడంతోనే మొబైల్, టాబ్లెట్లు, వీడియో గేమ్‌ లు తో కుస్తి పడుతున్నారు.

పిల్లలు ఎక్కువ సేపు మొబైల్లో గేమ్స్ ఆడటం వల్ల వారి మెదడు కుంచించుకుపోయే అవకాశం ఉన్నట్లు ఓ అధ్యయనంలో వెల్లడైంది. రోజుకు ఏడు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఇలాంటి సాధనాలపై వెచ్చించే తొమ్మిది, పదేళ్ల వయస్సు ఉన్న పిల్లలపై ఈ ప్రభావం పడుతోందని అధ్యయనం చెబుతోంది.

మొబైల్ గేమ్స్‌ను రెండు గంటలు లేదా అంతకన్నా ఎక్కువ సమయం గడిపే పిల్లలు భాష, రీజనింగ్ సంబంధిత అంశాలపై పరీక్షల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నట్లు తేలింది. మొబైల్, ఇతర సాధనాల వాడకం పిల్లల్లో వ్యసనంగా మారుతోనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు రెండు గంటల కంటే తక్కువ సమయం స్మార్ట్ తెరలను వినియోగించే 11 ఏళ్లలోపు పిల్లల్లో మానసిక సామర్థ్యం మెరుగ్గా ఉంటుందని మరో అధ్యమనంలో తేలింది. చిన్నారులు రోజుకు 11 గంటలు నిద్రపోతే మరిన్ని మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. 

Tags:    

Similar News