జుట్టూ పెరగాలంటే అవి తినాలా..?

Update: 2019-07-17 09:55 GMT

మనిషి అందంగా కనబడటానికి కురులూ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాయి. జుట్టూ స్టైల్ గా.. ఒత్తుగా ఉంటే ఆ ఆకర్షణ వేరు. అయితే జుట్టూ, గోళ్లకూ ప్రత్యేకమైన ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. ఆరోగ్యమైన జుట్టు మరియు గోళ్ల కోసం వివిధ రకాల పోషకాలు అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

తినే ఆహారంలో.. మాంసకృత్తులు, పళ్లు, కూరగాయలు, బీన్స్, తృణధాన్యాలు ఇవన్నీ ఉండేట్లు చూసుకోవాలట. ఇవీ మన గోళ్ల ఆరోగ్యంగా ఉండాటానికి ఎంతో మెలు చేస్తాయి అంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే పోషకాలు మన గోళ్ల ఆరోగ్యానికి చాల దోహాదం చేస్తాయంటున్నారు నిపుణులు.

అలాగే తల వెంట్రుకల కోసం.. ఐరన్ సమృద్ధిగా ఉండే.. లివర్, డ్రైఫ్రూట్స్, మొలకెత్తిన శెనగలు, సోయా, పనీర్ లాంటివి తినాలని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. తీసుకునే ఆహారంలో ఇవి ఉంటే జుట్టూ పెరిగే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో ఉంటే పోషకాల వల్ల జుట్టూ రాలటం కూడా తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. 

Tags:    

Similar News