Marriage: వివాహం ముందు తప్పనిసరిగా చేయాల్సిన 5 వైద్య పరీక్షలు..
వివాహం అనేది జీవితాంతం పాటు కొనసాగే బంధం. ఇది ఇద్దరి మధ్య ప్రేమ కంటే ఎక్కువ.. రెండు కుటుంబాల కలయిక. పెళ్లి తర్వాత ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం అత్యవసరం.
Marriage: వివాహం ముందు తప్పనిసరిగా చేయాల్సిన 5 వైద్య పరీక్షలు..
వివాహం అనేది జీవితాంతం పాటు కొనసాగే బంధం. ఇది ఇద్దరి మధ్య ప్రేమ కంటే ఎక్కువ.. రెండు కుటుంబాల కలయిక. పెళ్లి తర్వాత ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించాలంటే శారీరక, మానసిక ఆరోగ్యం అత్యవసరం. అందుకే పెళ్లికి ముందు కొన్ని ముఖ్యమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల అనేక సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు. ప్రేమ పెళ్లైనా, పెద్దలు కుదిర్చినదైనా ఈ 5 మెడికల్ టెస్టులు తప్పకుండా చేయించుకోండి:
1. తలసేమియా స్క్రీనింగ్
తలసేమియా అనేది జన్యుపరమైన రక్త సంబంధిత వ్యాధి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ఇది ఉంటే, వారి పిల్లలకూ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. అందుకే వివాహానికి ముందు ఇద్దరూ తలసేమియా స్క్రీనింగ్ చేయించుకోవాలి.
2. లైంగిక వ్యాధుల పరీక్షలు
హెచ్ఐవి, హెపటైటిస్ B/C, సిఫిలిస్, గోనేరియా లాంటి వ్యాధులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఈ వ్యాధుల లక్షణాలు వెంటనే బయటపడకపోవచ్చు. పెళ్లికి ముందు ఈ పరీక్షలు చేయించుకుని ఫలితాలు తెలుసుకోవడం కీలకం.
3. ఫెర్టిలిటీ (సంతానోత్పత్తి) ప్రొఫైల్
తల్లి తండ్రులు కావాలన్న ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే సంతానోత్పత్తికి సంబంధించి సమస్యలు ఎవరిలోనైనా ఉండవచ్చు. ఆ సమస్యలను ముందే గుర్తించేందుకు ఈ పరీక్షలు సహాయపడతాయి. అవసరమైతే ముందే చికిత్స తీసుకోవచ్చు.
4. రక్త వర్గం పరీక్ష (Blood Group + Rh Factor)
రక్త గ్రూప్ అనేది రొటీన్ టెస్ట్ అనిపించవచ్చు కానీ, Rh నెగటివ్ – Rh పాజిటివ్ కలయిక ఉన్న జంటలకు భవిష్యత్తులో గర్భధారణలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యను ముందే గుర్తించి నివారించవచ్చు.
5. జన్యుపరమైన పరీక్షలు (Genetic Screening)
కుటుంబ చరిత్రలో మధుమేహం, గుండెజబ్బులు, మానసిక రుగ్మతలు ఉంటే, వాటి ప్రభావం కాబోయే తరాలపై ఉండే అవకాశముంది. జన్యుపరమైన స్క్రీనింగ్ ద్వారా ఇటువంటి సమస్యలను ముందే తెలుసుకుని నిర్ణయం తీసుకోవచ్చు.
ఈ పరీక్షలు చేయించుకోవడం ద్వారా మీరు భవిష్యత్తులో ఆరోగ్యకరమైన జీవితం గడిపే అవకాశాన్ని పెంచుకుంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది నిజం. కాబట్టి ప్రేమ అయినా, పెద్దల అనుమతితో జరిగే వివాహమైనా.. ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా జాగ్రత్త పడితే సమస్యలే దరిచేరవు!