Health Tips: కడుపునొప్పి నుంచి నిమిషాల్లో ఉపశమనం.. ఎలాగంటే..?
Health Tips: కడుపునొప్పి నుంచి బయటపడేందుకు చాలా మంది మందులు వాడుతుంటారు. అయితే దీని కోసం కొన్ని హోం రెమెడీస్ ప్రయత్నించవచ్చు.
Health Tips: కడుపునొప్పి నుంచి నిమిషాల్లో ఉపశమనం.. ఎలాగంటే..?
Health Tips: కడుపు నొప్పి అనేది ఒక సాధారణ సమస్య. ఇది ఎవరికైనా ఎప్పుడైనా జరగవచ్చు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ఇందులో అజీర్ణం, గ్యాస్, గుండెల్లో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. మీకు కడుపు నొప్పి వచ్చినప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటారు. కడుపునొప్పి నుంచి బయటపడేందుకు చాలా మంది మందులు వాడుతుంటారు. అయితే దీని కోసం కొన్ని హోం రెమెడీస్ ప్రయత్నించవచ్చు. ఇది గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
అల్లం
అల్లంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందుకోసం అల్లం ముక్కలను కోసి నీళ్లలో వేసి కాసేపు మరిగించాలి. ఈ నీటిని ఫిల్టర్ చేసి అందులో కొంచెం తేనె కలపాలి. రోజుకు 2 నుంచి 3 సార్లు త్రాగాలి. ఇది కడుపు నొప్పి నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
సొంపు
సోంపు కడుపు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, ఉబ్బరం నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. ఒక కప్పు నీటిలో ఒక చెంచా సోంపు వేసి దీన్ని 10 నిమిషాలు మరిగించాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫిల్టర్ చేసి ఇందులో కొంచెం తేనె కలిపి తాగాలి. రోజుకు 2 నుంచి 3 సార్లు ప్రయత్నించవచ్చు.
ఇంగువ
ఇంగువ తీసుకోవడం వల్ల అజీర్ణం, కడుపు నొప్పి, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. దీని కోసం ఒక గ్లాసు వేడి నీటిలో చిటికెడు ఇంగువ వేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు తీసుకోవాలి. మీరు దీనికి రాతి ఉప్పును కూడా కలుపుకోవచ్చు. ఇది కడుపు నొప్పి, గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పుదీనా
పుదీనా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది కడుపు నొప్పి, గ్యాస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీని కోసం ఒక కప్పు నీటిలో పుదీనా వేయాలి. దీన్ని 10 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు దీనిని ఫిల్టర్ చేసి తాగాలి. రోజుకు 2 నుంచి 3 సార్లు చేయాలి. మంచి ఉపశమనం ఉంటుంది.