Health: పండ్లు తినాలా.? జ్యూస్ తాగాలా.? రెండింటిలో ఏది బెటర్‌..!

Fruit Juice vs Fruit: ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను తీసుకోవాలని తెలిసిందే. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి.

Update: 2025-02-24 10:35 GMT

Health: పండ్లు తినాలా.? జ్యూస్ తాగాలా.? రెండింటిలో ఏది బెటర్‌..

Fruit Juice vs Fruit: ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను తీసుకోవాలని తెలిసిందే. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో సహాయపడతాయి. కానీ, కొంతమంది పండ్లను తినడానికి బదులుగా జ్యూస్ రూపంలో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పండ్లను నేరుగా తినలా.? జ్యూస్‌ రూపంలో తీసుకోవాలా.? అనే సందేహం వస్తుంది. ఇంతకీ పండ్లు తింటే మంచిదా.? జ్యూస్ రూపంలో తీసుకుంటే మంచిదా.? ఇప్పుడు తెలుసుకుందాం.

పండ్లు తినడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు శరీరానికి లభిస్తాయి. ముఖ్యంగా, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరిచి, రక్తంలో చక్కెర స్థాయులను సమతుల్యం చేస్తుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో త్వరగా కడుపు నిండిన భావక కలుగుతుంది. ఫలితంగా, బరువు తగ్గేందుకు ఇది సహాయపడుతుంది. అదనంగా, పండ్లు తినడం వల్ల శరీరానికి శక్తి లభించడంతో పాటు చర్మం కాంతివంతంగా మారుతుంది.

అదే సమయంలో పండ్లను రసం రూపంలో తీసుకుంటే అందులో ఫైబర్‌ కంటెంట్‌ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే జ్యూస్‌లో నీరు, చక్కెర కలుస్తుంది. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించినా, రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచే అవకాశం ఉంది. అంటే, జ్యూస్ తాగడం పండ్లు తినడం అంతా మంచిది కాదని చెప్పొచ్చు. అయితే జ్యూస్ తీసుకున్నా కొన్ని లాభాలు ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది.

పండ్లు తినాలా? లేదా జ్యూస్ తాగాలా?

పండ్లు, అలాగే జ్యూస్‌లలో ఉండే పోషక విలువల్లో తేడా స్పష్టంగా ఉంటుంది. పండ్లను తీసుకుంటే వాటి ఆరోగ్య ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. జ్యూస్‌ తాగితే శరీరానికి తక్షణ శక్తి లభించినా, దీని ప్రభావం ఎక్కువ సమయం కొనసాగదు. అందువల్ల, పండ్ల రసం కంటే పండ్లు తినడమే ఉత్తమం. ఒకవేళ జ్యూస్ తీసుకోవాలని అనిపిస్తే.. తాజా పండ్లతో చేసుకోవాలి. అదే విధంగా అదనంగా షుగర్ యాడ్‌ చేయకూడదు. మార్కెట్‌లో లభించే ప్యాక్ చేసిన జ్యూస్‌లు అధిక ప్రిజర్వేటివ్స్, చక్కెర, ఫ్లేవర్‌లను కలిగి ఉండటంతో, అవి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. టెట్రా ప్యాక్‌ జ్యూస్‌ను తీసుకోవడం మానేయాలి. 

Tags:    

Similar News