ప్రతీ సంవత్సరం ఎంతో మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అందుకు ఎన్నో కారణాలున్నాయి. అయితే హార్ట్ ఎటాక్స్ రావడానికి ప్రధాన కారణం.. రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడమే. దీని కారణంగా గుండెకు రక్తం సరిగ్గా సరఫరా అవదు. ఫలితంగా హార్ట్ ఎటాక్ వస్తుంది. ఈ క్రమంలో అలా హార్ట్ ఎటాక్స్ రాకుండా, ఇతర గుండె సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మరి తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలేంటో ఇప్పు చూద్దాం.
* చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
* ఓట్స్‌లో ఉండే ఫైబర్ మన శరీరంలో కొలెస్ట్రాల్ నుంచి తయారయ్యే ప్రమాదకర బైల్ యాసిడ్స్‌ను శరీరం నుంచి బయటకు పంపుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కనుక ఓట్స్‌ను తరచూ తీసుకుంటే గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు.
* జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులను రోజూ గుప్పెడు మోతాదులో తింటూ ఉండాలి.
* రక్తంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో పెసలు అమోఘమైన పాత్ర పోషిస్తాయి. నిత్యం పెసలను నానబెట్టుకుని, మొలకెత్తించి లేదా ఉడకబెట్టి గుగ్గిళ్ల రూపంలో తింటుంటే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.
* అవిసె గింజల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు వీటిలో ఫైబర్, ఫైటోఈస్టోజెన్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి.
* నిత్యం ఉదయాన్నే పరగడుపున రెండు నుంచి నాలుగు వెల్లుల్లి రెబ్బలను నలిపి అలాగే తినేయాలి. ఘాటుగా ఉన్నాయనుకుంటే తేనెతో కలిపి తినవచ్చు. వెల్లుల్లిని తీసుకుంటే రక్త నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.