ఎనర్జీ డ్రింకులు తాగుతున్నారా?

Update: 2019-06-06 09:11 GMT

ప్రస్తుత కాలంలో చాలా మందికి ఎనర్జీ డ్రింక్స్ తాగడం ఓ అలవాటుగా మారిపోయింది. ఇన్‌స్టంట్ ఎనర్జీ పొందేందుకు యువత వీటికి అలవాటు పడిపోతున్నారు. అయితే ఈ డ్రింక్స్‌ను అప్పుడప్పుడు తాగితే ఫర్వాలేదు కానీ.. అదే పనిగా తాగితే మాత్రం అనేక ఆనారోగ్య సమస్యలకు దారితిస్తాయని చెబుతున్నారు పరిశోధకులు.

ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువ తాగడం వల్ల శరీరంలో రక్తపోటు స్థాయి పెరిగిపోయి హృదయ స్పందనల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకుంటాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ పసిఫిక్ సైంటిస్టులు ఈ అంశంపై పరిశోధన చేపట్టారు. 18-40 ఏళ్ల వయస్సు గల 34 మందిని ఎంపిక చేసుకుని వారికి 304-320 గ్రాముల కెఫైన్ కలిసిన 32 ఔన్స్‌ల ఎనర్జీ డ్రింక్‌ను తాగించారు. ఆ డ్రింక్ తాగిన వారిలో హృదయ స్పందనలు 6 మిల్లీ సెకన్ల నుంచి 7.7 మిల్లీ సెకన్లకు పెరిగినట్లు వెల్లడించారు.

హృదయ స్పందనలో మార్పులు జరిగితే అది ప్రాణాలకే ప్రమాదమని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తక్షణ శక్తిని ఇస్తాయని ఎక్కువ ఎనర్జీ డ్రింకులు తాగితే గుండె జబ్బులు ఖాయమని పరిశోధకులు చెబుతున్నారు. తక్కవగా ధరలకే వస్తున్నాయని ఎనర్జీ డ్రింకులు ఎక్కువగా తెచ్చుకుని తాగకండి.

ఎనర్జీ డ్రింక్స్ బదులుగా క్యారెట్లను ఎక్కువగా తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది... వీటిలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్లకు మేలు చేయడంతోపాటు అలసటను దూరం చేస్తుంది. వాటిని తొక్కు తీసేసి ముక్కలు ముక్కలుగా చేసుకుని ఆఫీసుకు తీసుకెళ్లి కూడా తినేయవచ్చు. వీటిని తినడం వల్ల నీరసంగా ఉండదు. అలాగే ఆపిల్ పండులో శక్తినిచ్చే విటమిన్లు, మినరల్స్ వంటివాటితోపాటు పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటాయి. రోజు యాపిల్ తినడం వల్ల రోజంతా ఎనర్జీగా ఉంటారు.

Tags:    

Similar News