పగటిపూట నిద్రపోతున్నారా.. అయితే..

Update: 2019-08-20 04:59 GMT

ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడు తినుంటున్నామ్.. ఎప్పుడు పడుకుంటున్నామ్ అని ఒకసారి ఆలోచిస్తే.. నైట్ టైం 12 వరకు మెళుకువగా ఉండేవాళ్లు చాలా మంది ఉన్నారు. సమయానికి తిని.. నిద్రపోవటం కొంత మందికి సాధ్యం కాకపోవచ్చు. దీనికి కారణాలు అనేకం ఉండోచ్చు. అయితే ఆఫీసు సమయం అయిపోయాక కూడా పని చేస్తూ ఉండే వాళ్లు ఉన్నారు. మరికొంత మంది సెలవుల్లో ఇంటి దగ్గరున్నా ల్యాప్‌టాప్‌, స్మార్ట్‌ ఫోన్లతో అర్థరాత్రి వరకు పడుకోరు.

ఇంకొంత మంది పగటిపూట ఎక్కువ సమయం పడుకుంటానికి ఇష్టపడుతుంటారు. ఆపీసులో ఉన్న లంచ్ తరువాత కొంచెం సేపు ఓ కునుకు వేసే వారు ఉన్నారు. నైట్ డ్యూటీలు చేసి పగటిపూట నిద్రపోయే వాళ్లు ఉన్నారు. అయితే పగలు ఎక్కువ సేపు నిద్రపోవటం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు.

పగలు ఎక్కువగా నిద్రపోవడం వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఇటీవల చేసిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మనుషులను నిద్రపోకుండా ఉంచే మెదడులోని భాగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. పగలు ఎక్కువగా నిద్రపోయే వారిలో తీసుకున్న ప్రొటీన్లు మెదడుకు చేరడం లేదని ఆ పరిశోధనలో వారు గుర్తించారు. దీని ఫలితంగా మనుషులను మెలకువతో ఉంచే నాడీకణాలు చనిపోతున్నట్టు వారు తెలిపారు. ఇది మతిపరుపుకు దారి తీసే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.  

Tags:    

Similar News