Ice Cream : చలికాలంలో ఐస్‌క్రీమ్ తింటే జలుబు చేస్తుందా? పెద్దలు చెప్పేది నిజమేనా?

చలికాలం వచ్చిందంటే చాలు.. ఇంట్లో పెద్దవాళ్లు ఆంక్షలు మొదలుపెడతారు. బయట చలిగా ఉంది, ఫ్రిజ్‌లో వస్తువులు తినొద్దు, ఐస్‌క్రీమ్ జోలికి అసలు వెళ్లొద్దు అని గద్దిస్తుంటారు.

Update: 2026-01-03 06:30 GMT

Ice Cream : చలికాలంలో ఐస్‌క్రీమ్ తింటే జలుబు చేస్తుందా? పెద్దలు చెప్పేది నిజమేనా?

Ice Cream : చలికాలం వచ్చిందంటే చాలు.. ఇంట్లో పెద్దవాళ్లు ఆంక్షలు మొదలుపెడతారు. బయట చలిగా ఉంది, ఫ్రిజ్‌లో వస్తువులు తినొద్దు, ఐస్‌క్రీమ్ జోలికి అసలు వెళ్లొద్దు అని గద్దిస్తుంటారు. తింటే జలుబు, దగ్గు గ్యారెంటీ అని భయపెడతారు. కానీ, ఐస్‌క్రీమ్ ప్రియులకు సీజన్‌తో సంబంధం ఏముంటుంది? డిసెంబర్ చలిలో కూడా ఐస్‌క్రీమ్ పార్లర్లు కిటకిటలాడుతూనే ఉంటాయి. ఇంతకీ చలికాలంలో ఐస్‌క్రీమ్ తింటే నిజంగానే జబ్బులు వస్తాయా? దీనిపై వైద్య నిపుణులు ఏమంటున్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే, ఐస్‌క్రీమ్ తింటే అది నేరుగా జలుబుకు దారితీస్తుందని. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జలుబు లేదా జ్వరం రావడానికి కారణం వైరస్‌లు లేదా బ్యాక్టీరియా మాత్రమే, చల్లని ఆహారం కాదు. మనం ఐస్‌క్రీమ్ తిన్నప్పుడు, అది కడుపులోకి వెళ్లగానే మన శరీరం తన సహజ ఉష్ణోగ్రతతో దాన్ని వెంటనే వేడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోదు. నిజానికి, ఐస్‌క్రీమ్ తినడం వల్ల మెదడులో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలయ్యి ఒత్తిడి తగ్గుతుంది. అందుకే చాలామంది చలిలో కూడా చిల్ అవ్వడానికి ఐస్‌క్రీమ్‌ను ఎంచుకుంటారు.

ఆరోగ్యంగా ఉన్నవారు చలికాలంలో ఐస్‌క్రీమ్ తిన్నా పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ, ఇప్పటికే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గొంతు నొప్పి ఉన్నవారు ఐస్‌క్రీమ్ తింటే ఆ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అస్తమా లేదా దీర్ఘకాలిక దగ్గు ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండాలి. చలికాలంలో గాలిలో తేమ తక్కువగా ఉండటం వల్ల ఐస్‌క్రీమ్ తిన్నప్పుడు గొంతు మరింత పొడిబారి, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉంటుంది.

చలికాలంలో ఐస్‌క్రీమ్ తినాలనిపిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఐస్‌క్రీమ్‌ను గబగబా మింగేయకుండా, నోటిలో కొంచెం సేపు ఉంచుకుని నెమ్మదిగా తినాలి. దీనివల్ల దాని చల్లదనం తగ్గి శరీర ఉష్ణోగ్రతకు సమతుల్యం అవుతుంది. ఐస్‌క్రీమ్ తిన్న వెంటనే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు లేదా పాలు తాగడం వల్ల గొంతు సాధారణ స్థితికి వస్తుంది. ఇప్పటికే కొంచెం జలుబుగా అనిపిస్తుంటే మాత్రం ఐస్‌క్రీమ్ జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం.

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఐస్‌క్రీమ్ తీసుకోవడం వల్ల పెద్దగా నష్టం ఉండదు. కానీ అతిగా తింటే మాత్రం గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఏ ఆహారమైనా మితంగా తీసుకున్నప్పుడే అది మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు పూర్తి ఆరోగ్యంగా ఉంటే, ఈ వింటర్ లో కూడా మీ ఫేవరెట్ ఐస్‌క్రీమ్‌ను నిరభ్యంతరంగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ తిన్న తర్వాత కాస్త జాగ్రత్తగా ఉండటం మాత్రం మర్చిపోకండి.

Tags:    

Similar News