Health Tips: నిద్రలో నోరు పొడిబారుతుందా.. ఈ వ్యాధుల ప్రమాదం ఉన్నట్లే..!

Health Tips: కొంతమందికి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా గొంతు ఎండిపోతుంది.

Update: 2022-12-13 14:30 GMT

Health Tips: నిద్రలో నోరు పొడిబారుతుందా.. ఈ వ్యాధుల ప్రమాదం ఉన్నట్లే..!

Health Tips: కొంతమందికి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా గొంతు ఎండిపోతుంది. ఇది ఒక్కరోజు జరిగితే పర్వాలేదు. కానీ ప్రతిరోజు జరిగితే ఇది ప్రమాదకరమైన వ్యాధుల లక్షణంగా చెప్పవచ్చు. దీనిని తేలికగా తీసుకుంటే భవిష్యత్‌లో చాలా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి నిద్రపోతున్నప్పుడు గొంతు పొడిబారడానికి అనేక కారణాలు ఉంటాయి. గొంతు ఎందుకు ఎండిపోతుంది దానిని ఎలా నివారించాలో ఈ రోజు తెలుసుకుందాం.

మధుమేహం

డయాబెటిక్ రోగులలో పొడి గొంతు లక్షణాలు కనిపిస్తాయి. అధిక చక్కెర స్థాయి కారణంగా గొంతు పొడిబారడం ప్రారంభమవుతుంది. నీరు ఎక్కువగా తాగిన తర్వాత కూడా గొంతు పొడిగా మారితే అది అధిక చక్కెర లక్షణంగా గుర్తించవచ్చు.

సైనస్

చాలా మందికి సైనస్ వచ్చినప్పుడు నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఈ పరిస్థితిలో వారు ముక్కుతో శ్వాస తీసుకోలేరు. రాత్రిపూట నోరు తెరిచి శ్వాస తీసుకుంటారు. దీంతో గొంతు పొడిబారినట్లు అనిపిస్తుంది.

పాలీడిప్సియా

నిద్రపోతున్నప్పుడు గొంతు పొడిబారడం పాలీడిప్సియా లక్షణం. ఇందులో శరీరంలో నీటి కొరత ఉంటుంది. శరీరానికి నీరు అవసరం లేదంటే గొంతు ఎండిపోతుంది.

డీహైడ్రేషన్

చాలా మంది తక్కువ నీరు తాగుతారు. ఈ పరిస్థితిలో శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. శరీరంలో నీరు లేదంటే డీహైడ్రేషన్ కారణంగా రాత్రిపూట గొంతు పొడిబారడం సమస్య వస్తుంది. తక్కువ నీరు తాగడం వల్ల గొంతు పొడిబారిపోతుంది.

జాగ్రత్తలు

మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు పొడి గొంతుతో ఇబ్బంది పడుతుంటే కొన్ని పద్ధతులను అనుసరించడం ద్వారా సమస్యను నివారించవచ్చు. నీటి కొరతను తీర్చడానికి రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఇది కాకుండా నోరు తెరిచి నిద్రించడం మానేయాలి.

Tags:    

Similar News