Health: వేసవిలో చల్లగా ఉంటుందని నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా.? ఏమవుతుందంటే
Lemon Juice in Summer: నిమ్మకాయ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది.
Health: వేసవిలో చల్లగా ఉంటుందని నిమ్మరసం ఎక్కువగా తాగుతున్నారా.? ఏమవుతుందంటే
Lemon Juice in Summer: నిమ్మకాయ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. మరీ ముఖ్యంగా వేసవిలో నిమ్మరసాన్ని తరచూ తీసుకుంటారు. అయితే నిమ్మరసం ఆరోగ్యానికి మంచిదనడంలో నిజం ఉన్నట్లే ఎక్కువగా తీసుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు. నిమ్మ రసాన్ని మోతాదుకు మించి తీసుకుంటే ఈ సమస్యలు తప్పవని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ దంతాలపై ప్రభావం చూపుతుంది. ఇది దంతాల ఉపరితలాన్ని దెబ్బతీసి, దంతాలను సున్నితంగా మారుస్తుంది. అలాగే క్యావిటీస్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. నిమ్మరసం తాగేటప్పుడు స్ట్రా ఉపయోగించడం వల్ల ఆమ్లం నేరుగా దంతాలపై పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది.
* నిమ్మకాయ ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్ల ఉత్పత్తి పెరుగుతుంది. దీని ప్రభావంతో కడుపు మంట, అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలు ఎదురవుతాయి. కొందరికి కడుపు నొప్పి, ఆమ్లత్వం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.
* విటమిన్ సి ఎక్కువగా తీసుకుంటే విరేచనాలు, జీర్ణ సమస్యలు కలగొచ్చు. ఒక వ్యక్తికి రోజువారీ అవసరమైన విటమిన్ సి పరిమితి దాటితే, అది ఆరోగ్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది.
* నిమ్మరసం తరచూ లేదా అధికంగా తీసుకోవడం వల్ల గొంతులో రాపిడి, వాపు వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా అప్పటికే గొంతు ఇన్ఫెక్షన్, జలుబు సమస్యలతో బాధపడేవారికి సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
నిమ్మకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నది నిజమే. కానీ రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసులకు మించి తీసుకోకూడదు. మోతాదుకు మించి తీసుకుంటే.. ప్రయోజనం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది.