Health Tips: అర్దరాత్రి గొంతు పొడిబారుతుందా.. ఈ వ్యాధి బారిన పడే అవకాశం..!

Health Tips: అర్ధరాత్రి గొంతు పొడిబారడం వల్ల చాలామందికి నిద్రభంగం జరుగుతుంది.

Update: 2023-05-25 16:00 GMT

Health Tips: అర్దరాత్రి గొంతు పొడిబారుతుందా.. ఈ వ్యాధి బారిన పడే అవకాశం..!

Health Tips: అర్ధరాత్రి గొంతు పొడిబారడం వల్ల చాలామందికి నిద్రభంగం జరుగుతుంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరుదు. కళ్లు తెరుచుకునే ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది దీనిని తేలికగా తీసుకుంటారు కానీ ఇది అనేక వ్యాధులకు సంకేతం కావొచ్చు. కాబట్టి అధిక దాహం ఏ వ్యాధికి లక్షణమో ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

డీహైడ్రేషన్

శరీరంలో నీరు లేకపోవడం డీహైడ్రేషన్‌కి సంకేతమని చెప్పవచ్చు. తక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో ఎన్ని నీళ్లు తాగినా దాహం చల్లారదు. డీహైడ్రేషన్‌ నివారించడానికి గరిష్టంగా నీరు, పండ్ల రసం, కొబ్బరి నీరు తీసుకోవడం మంచిది. ఎండాకాలంలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి.

మధుమేహం

రక్తంలో చక్కెర పరిమాణం పెరిగినప్పుడు శరీరం మూత్రం ద్వారా చక్కెరను బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది. దీని కోసం తరచుగా మూత్రవిసర్జన చేయాల్సి ఉంటుంది. దీని వల్ల పదే పదే దాహం వేస్తుంది. అంతేకాదు గాఢనిద్రలో ఉన్నప్పుడు నిద్ర భంగం జరుగుతుంది.

రక్తపోటు

రక్తపోటు పెరిగినప్పుడు శరీరం నుంచి చాలా చెమట బయటకు వస్తుంది. దీని వల్ల డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. అధిక రక్తపోటు కారణంగా శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. దీనివల్ల అర్ధరాత్రి ఒక్కసారిగా దాహం వేసినట్లవుతుంది.

Tags:    

Similar News