షాంపూతో అలా చేస్తే.. కారు, బైక్ తళతళ మెరిసిపోతుంది..!

Update: 2019-07-24 11:27 GMT

అబ్బా అసలే వర్షకాలం.. కస్తా వర్షం పడిందంటే ఇక అంతా బురదమయం. బైకో లేదా కారు మీద బయటకు వెళ్లివస్తే.. ఎంతో నీట్ గా ఉన్న వాహనాలు కాస్తా బురదమయం అయిపోతాయి. ఆ మట్టిని పొగొట్టాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే వాహనాలను నీట్ గా తళతళా మెరిసేలా చేయడానికి చిన్న చిట్కా ఉంది. అదే షాంపూ.. అవును ఇంట్లో వాడో షాంపూతోనే మరకలన్నీ వదిలించవచ్చు.

గ్రీజు, మురికి, మట్టి.. ఎలాంటి మరకలైనా షాంపూతో మాయం అవుతాయి. ఒక బకెట్టు నీళ్లు తీసుకొని అందులో రెండు స్పూన్ల షాంపూ వేసి బాగా కలపాలి. తర్వాత మెత్తని క్లాత్ తీసుకుని అందులో ముంచి కారు లేదా బైక్ భాగాలన్నీ బాగా తుడవాలి. తర్వాత నీటితో కడిగి, పొడి క్లాత్ తో తుడిస్తే కారు లేదా బైక్ మెరిసిపోతుంది. అన్నింట్లో కన్నా బేబీ షాంపూ వాడితే వాహనాలు తళ తళా మెరిసి పోతాయి. అయితే మిగతా షాంపులతో పోల్చితే బేబీ షాంపులో కారు రంగుపై ప్రభావం చూపే రసాయన పదార్థాలు తక్కువగా ఉంటాయి.  

Tags:    

Similar News