బరువు తగ్గించుకోవడానికి జీమ్ వెళ్ళి అష్టకష్టాలు పడుతున్నారా?

Update: 2019-07-05 15:57 GMT

బరువు తగ్గించుకోవడానికి రోజు జీమ్‌కు వెళ్ళి అష్టకష్టాలు పడుతున్నారా? శరీరంలో కేలరీలు తగ్గించుకోవాలనే కష్టపడుతున్నారా?. అయితే అంతలా కష్టపడుకుండా ఓ గంట సేపు రోజు సైకిల్‌ తొక్కితే చాలు చాలా సులువుగా బరువు తగ్గించుకొవచ్చు. చిన్న చిన్న పనులకు బైక్‌ల మీదే కాకుండా సైకిల్‌ మీదే వెళ్లండి. వీలైతే ఆఫీసుకు కూడా సైకిల్ తీసికెళ్ళండి. సైక్లింగ్‌కు మించిన వ్యాయామం లేదని, సరైన శరీరాకృతికి సైక్లింగ్‌ ఉపయోగపడుతుందని డెన్మార్క్‌లోని కొపెన్‌గన్‌ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు.

వారంలో ఐదుసార్లు జిమ్‌కు వెళ్లి వ్యాయామం చేస్తే శరీరంలో ఎంత కొవ్వు కరుగుపోతుంది. రోజూ ఓ గంట సేపు సైకిల్‌ తొక్కడం ద్వారా అదే స్థాయిలో కొవ్వు కరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. స్థూలకాయంతో బాధపడుతున్న 130 మందిపై ఈ పరిశోధన చేసి ఈ విషయాన్ని గుర్తించారు.

Tags:    

Similar News