జ‌లుబు మ‌రియు ద‌గ్గుతో బాధ‌ప‌డుతున్నారా..!

Update: 2019-07-05 16:00 GMT

వర్షాకాలం వ‌చ్చింది. వ‌ర్షాల‌తో పాటు ఈ కాలంలో సీజనల్‌ వ్యాధులు ముంచుకొచ్చే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఎండ నుంచి ఉపశమనం లభించినా.. పరిశుభ్రత పాటించకపోతే రోగాలబారిన పడే అవకాశం ఉంది. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల్లో సాధారణ జ్వరాలు, అతిసారం, టైఫాయిడ్‌, మలేరియా, డెంగీ వ్యాధులు ప్రబలుతున్నాయి. ముఖ్యంగా జ‌లుబు మ‌రియు ద‌గ్గు స‌మ‌స్య‌లు చాల‌మందిని బాధిస్తుంటాయి. జలుబు మరియు దగ్గు వలన కలిగే సమస్యలు మనశ్శాంతిని కలిగించవు. వీటి నుండి త్వరగా ఉపశమనం పొందాలనుకుంటాము. అయితే కొన్ని ఔషదాలు చిటికెలో ఈ సమస్యను దూరం చేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* పసుపు

పసుపు కలిపిన పాలు మన భారతదేశంలో ప్రాముఖ్యం పొందిన ఔషదంగా పేర్కొనవచ్చు. పసుపు యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను విస్తృతంగా కలిగి ఉంటుంది. కావున, దగ్గు లేదా జలుబు నుండి త్వరిత ఉపశమనం పొందుటకు పాలలో ఒక చెంచా పసుపు కలుపుకొని తాగితే మంచి ఫ‌లితం ఉంటుందంటున్నారు నిపుణులు.

* అల్లం

రోగనిరోధక శక్తి పెంచుకోటానికి అల్లంను విరివిగా వాడుతున్నారు. అల్లం చాలా సాధారణంగా మన ఇంట్లో ఉండే సహజ ఔషదం మరియు జలుబు, దగ్గులకు విరుగుగా పేర్కొంటారు. అల్లంతో చేసిన వేడి టీ వీటి నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది.

*వేడి నీరు

ఇదొక సులభమైన మరియు విరివిగా వాడే పద్దతి. జలుబును తగ్గించుకోటానికి కేవలం నీటిని తాగటం అనేది చాలా సులువైన పద్దతి. గోరువెచ్చగా ఉండే నీరు గొంతు భాగంలో కలిగే ఇన్‌ఫెక్ష‌న్ ల‌ను తగ్గిస్తుంది. రోజు మొత్తం వేడిగా ఉండే నీటిని తరచుగా తాగటం వలన మంచి ఫలితాలను పొందవ‌చ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Tags:    

Similar News