Chicken: లెగ్ పీస్ కాదు బ్రో… ఈ పార్ట్ తప్పక అడిగి కొనండి… ఆరోగ్యానికి ఎంత బెనిఫిట్ అనేది తెలుసా?
చికెన్ పేరు వినగానే నోరు నీరాటమవుతుంది, కదా? ఆదివారం విందులు, పార్టీలు, ఫంక్షన్లు కోసం చాలా మంది వంటకాల్లో చికెన్‌ను ప్లాన్ చేస్తారు.
Chicken: లెగ్ పీస్ కాదు బ్రో… ఈ పార్ట్ తప్పక అడిగి కొనండి… ఆరోగ్యానికి ఎంత బెనిఫిట్ అనేది తెలుసా?
చికెన్ పేరు వినగానే నోరు నీరాటమవుతుంది, కదా? ఆదివారం విందులు, పార్టీలు, ఫంక్షన్లు కోసం చాలా మంది వంటకాల్లో చికెన్‌ను ప్లాన్ చేస్తారు. ఎక్కువగా లెగ్ పీస్‌ను ఎంచుకుంటారు, ఎందుకంటే అది రుచికరంగా ఉంటుంది. కానీ నిజానికి, చికెన్‌లో ఆరోగ్యానికి అత్యంత లాభకరమైన భాగం ఏదో తెలుసా? ప్రతి భాగానికి వేర్వేరు పోషక విలువలు ఉంటాయి.
1. చికెన్ లివర్ (కాలేయం):
చికెన్‌లో అత్యంత పోషకమైన భాగం లివర్. ఇది ఐరన్, విటమిన్ A, విటమిన్ B12తో నిండి ఉంటుంది. రక్తాన్ని పెంచడానికి, రక్తహీనత తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అయితే కొలెస్ట్రాల్ మరియు కొన్ని విటమిన్లు ఎక్కువగా ఉండటంవల్ల, వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే తినడం ఆరోగ్యానికి మంచిది.
2. చికెన్ లెగ్:
చికెన్ లెగ్ జ్యూసీగా ఉండటం వల్ల చాలామందికి ఇష్టం. కొంత కొవ్వు ఉన్నప్పటికీ, ఇది శరీరానికి శక్తి, ప్రోటీన్ అందిస్తుంది. రోజంతా శారీరకంగా పని చేసే వారికి ఇది మంచి ఆహార ఎంపిక.
3. చికెన్ తొడ (Thigh):
తొడ మాంసం రుచికరమే కాక, ఐరన్, జింక్, విటమిన్ B12తో నిండి ఉంటుంది. బలహీనత, అలసట, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కొవ్వు శాతం కొద్దిగా ఎక్కువగా ఉండటంతో మితంగా తినడం మంచిది.
4. చికెన్ బ్రెస్ట్ (రొమ్ము భాగం):
చికెన్‌లో ఆరోగ్యానికి అత్యంత ఉత్తమ భాగం రొమ్ము మాంసం. ఇది ప్రోటీన్ అధికం, కొవ్వు చాలా తక్కువ. సులభంగా జీర్ణమవుతుంది. శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, జిమ్ చేసే వారు, మధుమేహం లేదా గుండె సమస్యలున్నవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఉడికించి లేదా గ్రిల్ చేసి తింటే పోషక విలువలు పూర్తిగా లభిస్తాయి.
చికెన్‌లో అన్ని భాగాలూ వేర్వేరు ప్రయోజనాలు కలిగినప్పటికీ, ఆరోగ్యానికి అత్యంత లాభకరం చికెన్ బ్రెస్ట్. వయస్సు, ఆరోగ్య స్థితి, జీవనశైలి ఆధారంగా ఇతర భాగాలు కూడా సమతుల్యంగా ఉపయోగపడతాయి. కాబట్టి, తక్కువ నూనెలో, శుభ్రమైన పద్ధతిలో వండటం మంచిది. సరైన భాగాన్ని ఎంచుకొని సమతుల్యంగా తింటే, చికెన్ నిజంగా ఆరోగ్యానికి బహుమతి అవుతుంది.