Char Dham Yatra: నేటి నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం..ప్రయాణ సమయంలో ఈ నియమాలు గుర్తుంచుకోండి
Char Dham Yatra Rules: చార్ ధామ్ యాత్ర నేటి నుంచి ప్రారంభమవుతుంది. హిందూమతంలో చార్ ధామ్ యాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. చార్ ధామ్ యాత్ర యమునోత్రి నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత గంగోత్రి ధామ్ వద్ద ప్రారంభమై..కేదార్ నాథ్ ధామ్, చివరికి బద్రీనాథ్ ధామ్ లో ముగుస్తుంది. ప్రతిఏడాది లక్షలాది మంది భక్తులు చార్ ధామ్ యాత్రకు తరలివెళ్తుంటారు. అయితే ప్రయాణంలో కొన్నినియమాలు పాటించాల్సి ఉంటుంది. మీరు కూడా చార్ ధామ్ యాత్రకు వెళ్తుంటే..పాటించాల్సి నియమాలు ఏంటో తెలుసుకుందాం.
హిందూమతంలో తల్లిదండ్రులను దేవునితో సమానంగా చూస్తారు. కాబట్టి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే ముందు తమ తల్లిదండ్రులను అనుమతి తీసుకోవడం తప్పనిసరి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా చేపట్టే ప్రయాణం శుభప్రదం కాదు.
చార్ ధామ్ యాత్ర సమయంలో మాంసాహార ఆహారానికి దూరంగా ఉండాలి. ఈ మొత్తం ప్రయాణంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసం, మద్యం నుంచి దూరంగా ఉండాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ యాత్ర చేసే సమయంలో మాంసాహారం తీసుకుంటూ చేసే ప్రయాణానికి ఎలాంటి ప్రాముఖ్యత ఉండదు.
మతపరమైన ప్రయాణంలో మంచి ప్రవర్తనతో ఉండాలి. చార్ ధామ్ యాత్ర సమయంలో ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. దుర్భాషను ఉపయోగించకూడదు. యాత్ర సమయంలో ఎప్పుడు భగవంతుడిని స్మరిస్తూ ధ్యానిస్తూ ఉండాలి. ప్రయాణంలో తప్పుడు ఆలోచనలు చేయకూడదు. ఇలా తప్పుడు ఆలోచనలతో చేసే యాత్ర ఫలవంత అవ్వదని పండితులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రజలు ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లినా..మొబైల్ సోషల్ మీడియాను ఉపయోగించడంలో బిజీగా ఉంటున్నారు. ప్రజల దృష్టి భక్తిపై కాకుండా ఫొటోలు, వీడియోలపై ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశంలో ఇలా చేయడం మంచిది కాదు. మీరు ఛార్దామ్ యాత్రకు వెళ్తున్నట్లయితే వీలైనంత తక్కువగా మొబైల్ వాడండి.
సనాతన ధర్మ విశ్వాసాల ప్రకారం ఎవరి ఇంట్లో అయినా మరణించినట్లయితే సూతక కాలం 12నుంచి 13 రోజుల వరకు ఉంటుంది. సూతకాలంలో మతపరమైన తీర్థయాత్రలు చేయడం నిషిద్ధం. ఇలా చేస్తే యాత్ర ఫలితం దక్కదని నమ్మకం.
ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లే సమయంలో ధరించే దుస్తుల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాలి. చార్ ధామ్ యాత్ర సమయంలో ధరించే బట్టలు శుభ్రంగా ఉంచుకోవాలి. మతపరమైన ప్రాముఖ్యతను ద్రుష్టిలో ఉంచుకుని రంగులను కూడా ఎంచుకోవాలి.