దోమలు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి

Update: 2019-07-24 11:33 GMT

వర్షకాలం వచ్చిదంటే చాలు దోమల బెడద తప్పదు. ఇంటి చూట్టు ఉండే అపరిశుభ్రత వల్ల దోమలు వస్తూనే ఉంటాయి.

అవి ఎన్నో ఎలర్జీలకు, జ్వరాలు కారణమవుతాయి. అయితే దోమల బారినుంచి తప్పించుకోవటానికి కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే వాటి బెడద నుంచి తప్పించుకోవచ్చు.

ఇంట్లో దోమలు పోవటానికి వాడే లిక్విడ్‌ రీఫుల్స్‌ , కాయిల్స్‌, ఇంకా మస్కిటో మాట్స్‌ వల్ల దోమలకే కాదు మనకి కూడా ప్రమాదమే అని చెప్తున్నారు నిపుణులు. ఆ వస్తువుల ప్రికాషన్‌ ఈ విషయం స్ఫష్టంగా ఉంటుంది. వీటి వల్ల ఎలర్జీలు, జలుబు, తుమ్ములు, దగ్గు, దురదలు, నరాలబలహీనత మొదలైనవి వచ్చే ప్రమాదం ఉంది. వీటిని కాకుండా ఎలాంటి రసాయనాలు లేని సహజ సిద్ధ నివారణా మార్గాలని పాటిస్తే మంచిది.

- కమలాపండు తొక్కల్ని ఎండబెట్టి వాటిని కాల్చితే చాలు దోమలు ఇంట్లోకి రావు

- పుదీనా వాసనకి దోమలు ఆ దరిదాపులకి రావట. అందుకే చిన్న చిన్న కుండీల్లో పుదీనా మొక్కల్ని పెంచుకుంటే మంచిది.

- దోమలు ఎక్కువగా ఉన్న చోట ఒక గిన్నెలో నీళ్ళు పోసి అందులో కర్పూరం బిళ్ళలు వేయాలి..దీంతో దోమల బాధ తగ్గుతుంది.

- అరటి తొక్కలు మంటలో కాల్చడం వల్ల దోమలు మాయం అవుతాయి.

- వేపాకుల్ని ఎండబెట్టి కాల్చడం వల్ల కూడా దోమలు రావు.

- మామిడిపండు తొక్కల్ని కూడా మండిచడం ద్వారా కూడా దోమలు ఇంట్లోకి రావటానికి కూడా భయపడతాయి. 

Tags:    

Similar News