తలనొప్పిని తగ్గించే చిట్కాలు..!

Update: 2019-07-23 11:25 GMT

ఇప్పటి బిజీ లైప్‌లో చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. ముఖ్యంగా అందరిని వేధిస్తున్న సమస్య తలనోప్పి ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళన.. వంటి అనేక కారణాల వల్ల మనకు అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఎలాంటి తలనొప్పినైనా మన ఇంట్లో లభించే వాటితోనే తగ్గించుకోవచ్చు. అదెలాగో ఓ సారి చూద్దాం!

బాగా తలనొప్పిగా ఉంటే జీడిపప్పు, పిస్తా, బాదంపప్పులను తినాలి. దీంతో వెంటనే తలనొప్పి తగ్గుతుంది. ఇవి నోప్పిని నివారిస్తాయి.

తలనొప్పి బాగా ఉంటే స్వచ్ఛమైన గాలిని కొంత సేపు ఉండండి. బయటకొద్ది సేపు వాకింగ్ చేయండి. వెంటనే నొప్పి తగ్గుతుంది.

ఓ గ్లాస్ వేడి నీటిని తీసుకుని దానిలో టీస్పూన్ అల్లం రసం కలుపుకుని తాగితే తలనొప్పి ఉపశమనం పొందవచ్చు.

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం వల్ల తలనొప్పిని తగ్గించుకోవచ్చు

మన శరీరంలో నీరు తక్కువైనా కూడా తలనొప్పి వస్తుంది. కావున నీటిని బాగా తాగాడం వల్ల తలనొప్పి తగ్గించుకోవచ్చు 

Tags:    

Similar News