యాపిల్ టీ తో ఇన్ని ప్రయోజనాలా..!

Update: 2019-07-23 11:23 GMT

రోజుకో యాపిల్ తింటే రోగాల దరిచేరవని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. యాపిల్ పండే కాదు యాపిల్ టీ కూడా ఆరోగ్యాని మంచిదంటున్నారు నిపుణులు. రోజు యాపిల్ టీ తాగితే ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు అంటున్నారు. బరువు తగ్గటానికి గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తోందో.. అంత కంటే ఎక్కువ యాపిల్ టీ చేస్తోందట.

యాపిల్ టీ ఫిట్‌నెస్‌తోపాటు శరీరబరువును అదుపులో ఉంచటంలో సహాయ పడుతుందట. రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాదు ఉదర సంబంధ సమస్యలన్నింటికీ యాపిల్‌ టీ చక్కటి ఔషధంలా పని చేస్తుంది. జాయింట్‌ పెయిన్‌ సమస్యలకు యాపిల్ టీ తాగితే ఉపశమనం కల్గుతుందంటున్నారు నిపుణులు. చర్మం సౌందర్యానికి యాపిల్ టీ ఎంతో ఉపయోగపడుతుదంటున్నారు నిపుణులు.  

Tags:    

Similar News