పెళ్లి చేసుకుంటే ఆ సమస్య పోతుందట..!

Update: 2019-07-09 15:36 GMT

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అంటారు పెద్దలు.. ఇల్లు, పెళ్లి రెండూ చాలా కష్టమైన వ్యవహారాలన్నది వారి అభిప్రాయం. ఇల్లు కట్టడం అటుంచితే.. పెళ్లి చేసుకోవడం వల్ల చాల ఉపయోగాలు ఉన్నాయట. అవును పెళ్లి చేసుకోవడం.. మంచి ఫ్రెండ్స్ ని కలిగి ఉండటం వల్ల మనకు మతిమరుపు, డెమెన్షియా సమస్యలు తగ్గుతాయట. లాబరో యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయాలను గుర్తించారు. సుమారు 6 వేల 6 వందల 77 మందిపై అధ్యయనం చేసి మరి.. వివరాలను వెల్లడించారు.

తాజాగా అధ్యయనం చేసినవారిలో మొదట ఎవరికీ డెమెన్షియా సమస్య లేదు. కానీ తర్వాత 220 మందికి ఈ సమస్య వచ్చిందట. వీరిని అధ్యయనం చేసిన పరిశోధకులు మతిమరుపు సమస్యకు పెళ్లి, స్నేహం, ఇతర సామాజిక అనుబంధాలకు సంబంధం ఉన్నట్లు గుర్తించారు. పెళ్లయిన వారితో పోల్చితే ఒంటరిగా ఉన్నవారికి డెమెన్షియా ముప్పు రెట్టింపు ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. పెళ్లయిన వారితో పోల్చితే పెళ్లికాని ప్రతి 100 మందిలో ఒకరు అదనంగా డెమెన్షియా బాధితులుంటారని పరిశోధకులు తెలిపారు. ఒంటరితనం కూడ డెమెన్షియాకు మూలమని పరిశోధకులు చెబుతున్నారు. 

Tags:    

Similar News