పరగడుపున నెయ్యి తింటే ఇన్ని ప్రయోజనాలా..!

Update: 2019-07-19 10:17 GMT

ఉదయం నిద్రలేవగానే చాలమందికి కాఫీ కానీ టీ కాని తాగుతుంటారు. మరికొంతమందికి అయితే బ్రేక్ ఫాస్ట్ తింటుంటారు. అయితే ఉదయాన్నే పరగడుపున వేడినీటిలో నెయ్యిని కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాల మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. బ్రేక్ ఫాస్ట్ కంటే ముందు పరగడుపునే నెయ్యిని తీసుకోవడం వలన ఆరోగ్యాన్ని అనేక విధాలుగా కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు.

* ప్రతి రోజూ ఉదయాన్నే ఒక స్పూన్ నెయ్యిని ఒక గ్లాసుడు వేడి నీటితో కలిపి తీసుకోవాలి. ఆ తరువాత మిగతావేమైనా తినే ముందు కనీసం 30 నిమిషాల వరకు వేచి ఉండాలి. ఇలా చేస్తే ఆరోగ్యానికి చాల మంచిదంటున్నారు నిపుణులు.

* చర్మానికి అవసరమైనంత తేమని అందించి పొడిచర్మం సమస్య నుంచి తక్షణ ఉపశమనం కలిగించడంలో నెయ్యి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను నివారించడంలో తోడ్పడుతుంది.

* అర్త్రైటిస్ ను అలాగే కీళ్ల నొప్పులను అరికడుతుంది నెయ్యి సహజసిద్ధమైన లూబ్రికంట్ గా పనిచేస్తుంది.

* పరగడుపునే నెయ్యిని తీసుకుంటే బ్రెయిన్ సెల్స్ ని మరింత యాక్టీవ్ గా ఉంచుకోవచ్చు. తద్వారా జ్ఞాపకశక్తిని, నేర్చుకునే సామర్థ్యాన్ని, కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ను మెరుగుపరచుకోవచ్చు. ఆ విధంగా డిమెన్షియా, అల్జీమర్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని అరికట్టవచ్చు. అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* ప్రతిరోజూ పరగడుపునే క్రమంతప్పకుండా 5 నుంచి 10 మిల్లీ లీటర్ల నెయ్యిని తీసుకుంటే బరువును తగ్గించుకోవడం సాధ్యపడుతుందంటున్నారు నిపుణులు.

Tags:    

Similar News