బరువు కంట్రోల్ చేసుకోవాలంటే బంగాళదంప..

Update: 2019-06-29 13:34 GMT

ఆమ్మో.. ఒకవైపు గజగజ వణికిస్తున్న చలి.. మరొవైపు ఇబ్బందిపెడుతున్న ఆరోగ్య సమస్యలు. దీంతో శరీరం బద్దకిస్తుంది. చలి కాబట్టి కొందరు ఉదయం నిద్రలేవాటానికి అసలే ఇష్టపడరు. ఇంకేముంది ఆటోమేటిక్ గా చలి ఉన్నంత కాలం వ్యాయామాలకు దూరం అవుతారు. దీనికి తోడు అధికంగా తినటానికి ప్రయత్నిస్తారు. ఇంకేముంది ఇప్పుడు వరకు మెయింటైన్ చేసిన ఫిట్‌నెస్ కాస్త బురదలో పోసిన పన్నీరవుతుంది. దీంతో శరీర బరువు పెరిగి బాధపడాల్సి వస్తుంది. అయితే సరైన ఆహారం తీసుకోవడం వలన ఆ బాధనుంచి తప్పించుకోవడమే కాదు మెరుగైన ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

* చలికాలంలో కాలీఫ్లవర్ ను తిని పెరిగే బరువును కంట్రోల్ చేసుకోవచ్చు.

* ఒక కప్పు కాలీఫ్లవర్ నుంచి 29 కెలోరీలు అందించబడతాయి.

* కాలీఫ్లవర్ బరువు పెరగటాన్ని కంట్రోల్ చేయడంతో పాటు కేన్సర్ వంటి ఆరోగ్య సమస్యలను దూరం చేస్తోంది.

* మాంసంతో పాటూ, కాల్చిన క్యారెట్ ముక్కలను తీసుకుంటే చలికాలంలో నడుము చుట్టూ కొలత పెరగకుండా ఉంటుంది.

* బ్రస్సెల్స్ మొలకలను రాత్రి తినటం వలన శరీరానికి కావలసిన విటమిన్ 'A', 'C' 'K' అందించబడతాయి.

బంగాళదుంప తినడం వల్ల బరువు పెరుగుతారని చాల మంది అనుకుంటారు. దీనిలో గ్లైసిమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుందని.. దీనివల్ల బరువు పెరుగుతారనే అపోహ చాలా మందికి ఉంది. ప్రతి రోజు బంగాళదుంప తినటం వలన బరువు తగ్గే ప్రణాళికకు ఎలాంటి హాని చేయదని 'యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా' నిపుణులు ఓ నివేదికలో పేర్కొన్నారు. బంగాళదుంప ఆరోగ్యకర కేలోరీలను శరీరానికి అందిస్తుందని వారు తెలిపారు. ఏది ఏమైనప్పటికీ మీరు మీకు ఇష్టమైన ఏ కూరలు అయిన తృప్తిగా ఆరగించండి. కాకపోతే సమాయానికి వ్యాయామం చేస్తూ చక్కటి హెల్త్ టిప్స్‌ని పాటించండి

Tags:    

Similar News