క్యాప్సికమ్‌తో ఎలర్జీ బలదూర్..!

Update: 2019-07-04 13:51 GMT

ఇండియన్ డిషెష్ లో క్యాప్సికమ్ చాల ముఖ్యమైన వంటకం. వంటలతో పాటు రకరకాల సలాడ్స్‌లో క్యాప్సికమ్ ని ఉపయోగిస్తుంటారు. క్యాప్సికమ్ తినడం అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. క్యాన్సర్‌‌తో బాధపడే వారికి క్యాప్సికమ్ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా క్యాప్సికమ్ లో ఉండే సి విటమిన్ రక్తం గడ్డకట్టకుండా సహాయపడుతుందట. అలాగే క్యాప్సికమ్‌లో ఉండే ఫినోలిక్స్, ప్లేవోనాయిడ్స్.. ఎలర్జీ సమస్యలతో బాధపడేవారికి ఉపశమనాన్ని కల్గిస్తుంది.

ఇందులో కేయాన్ పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల మంచి పెయిన్ రిలీఫ్ గా కూడా పనిచేస్తుందట. క్యాప్సికమ్‌లో క్యాలరీలు మరియు ఫ్యాట్ తక్కువగా ఉండటం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ వచ్చే అవకాశం ఉండదు. అంతేకాదు రోజు క్యాప్సికమ్ తీసుకోవడం వల్ల జుట్టు‌ ఊడిపోవడం చాల వరకు తగ్గుతుందట. వెంట్రుకలు ఒత్తుగా అవ్వటానికి క్యాప్సికమ్ ఓ మందులా సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

Tags:    

Similar News