పిక్క పట్టేస్తే ఏం చేయాలంటే

Update: 2019-07-09 15:44 GMT

ప్రస్తుత కాలంలో చాలామంది కండరాల నొప్పులుతో ఇబ్బందిపడుతున్నారు. దీనికి కారణంసరైన ఆహారం తీసుకోకపోవడమే అంటున్నారు వైద్యులు. మనకు సహజసిద్ధంగా లభించే బీట్‌రూట్ కండరాల నొప్పులు, పిక్కలు పట్టేయడం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా బిట్ రూట్ నుంచి అనేక ప్రయోజానాలు ఉన్నాయి.

రక్తలేమి సమస్యతో బాధపడేవారు బీట్‌రూట్ రసం తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బీట్‌రూట్ కండరాలలో బలం చేకూర్చే విధంగా సహాయపడుతుంది. బీట్రూట్‌లో నైట్రేట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. బీట్రూట్ రసం తాగడం వలన గుండె నుండి ప్రతి కండరాలకు రక్తప్రసరణ బాగా అందుతుంది. అందువల్ల గుండెకి సంబంధించిన శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఈ రసం తాగడం వలన కండరాలూ దృఢంగా తయారవుతాయి.

బీట్రూట్లో ఉండే నైట్రేట్లు వల్ల శరీరంలోని రక్తనాళాలు ఉత్తేజితమై, రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. వయసు పెరిగుతున్న కొద్ది బీట్రూట్ రసం తాగడానికి ప్రాధాన్యమవ్వాలి. కనీసం వారంలో రెండు సార్లయినా బీట్రూట్‌ని ఆహారంలో తీసుకుంటే మంచిది. 

Tags:    

Similar News