మధ్యాహ్నం నిద్ర గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య విషయాలు..

Update: 2019-05-31 14:04 GMT

సాధారణంగా మనలో చాలా మంది మధ్యాహ్నం పూట నిద్ర పోవడం అలవాటుగా ఉంటుంది. రోజు వారిగా ఉండే పని ఒత్తిడి కారణంగా మధ్యాహ్నం కాస్త అలా నిద్ర పోవాలనిపిస్తుంది, పొద్దున్నే ప్రారంభమైన మన దినచర్య సాయంత్రం వరకు బిజీగా ఉంటుంది. బాగా అలసిపోయినప్పుడు శరీరం రెస్ట్ కోరుకుంటుంది. అందుకే చాలా మందికి మధ్యాహ్నం నిద్ర వస్తుంది. ఇలా మధ్యాహ్నం గంటపాటు నిద్రపోవడాన్ని సియస్టా అంటాం. ఇలా ఒక గంటపాటు నిద్రపోవడం వల్ల శరీరం రిఫ్రెష్‌మెంట్ అవుతుంది. తిరిగి శక్తిని కూడగట్టుకోవడానికి కారణమవుతుంది. దీంతో యాక్టివ్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉదయం, సాయంత్రం, రాత్రి అనే సమయం అనేది లేకుండా పని చేసే వాళ్లకు మధ్యాహ్నం నిద్ర చాలా అవసరం.

ఎప్పుడైతే మన శరీరం అలసటకు గురవుతుందో అప్పుడు ఒక గంట నిద్రపోవడం మంచిది. మనం తీసుకున్న ఆహారం అరుగుదలకు నిద్ర తోడ్పడుతుంది. అలాగే ఎక్కువసేపు పని చేయడానికి సహాయం చేస్తుంది. చదువుకునేవారికి మధ్యాహ్నం నిద్ర చాలా ఉపయోగకరం బ్లడ్ ప్రెషర్ అదుపులో ఉంటుంది. గుండే మీద ఒత్తిడి కూడా తగ్గిలేచేస్తుంది మధ్యాహ్నం గంటన్నర నిద్రపోయే అలవాటు చేసుకుంటే, నరాల కదలిక బాగా ఉంటుందట. మధ్యాహ్నం నిద్రపోయేవారిపై ఒక రీసెర్చ్ చేసి స్టెట్‌మెంట్ ఇచ్చారు డాక్టర్లు. ఈ పరిశోధనల్లో బాగంగా అమెరికా సైనికులపై అధ్యయనం చేశారు.మధ్యాహ్న నిద్రకు అలవాటైన సైనికుల కదలికలు, అలవాటు లేని సైనికుల కదలికల కంటే ఎంతో చురుగ్గా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. స్థూలకాయంతో బాధపడేవారు, ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేవారు ఈ మధ్యాహ్నం నిద్రకి దూరంగా ఉంటేనే మంచిదట. 

Similar News