వెన్నునొప్పి బాధిస్తుందా అయితే..

Update: 2019-09-07 16:29 GMT

ఇప్పుడు చాలా మందిని వేధిస్తున్న సమస్య వెన్నునొప్పి. చిన్న నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య ఇది. , బయట శ్రమ వల కావచ్చు .ఆఫీస్ లో కూర్చొని చేసే పని చేసే సమయంలోనైనా కావచ్చు ఏదో ఒక సందర్భంలో వెన్నునొప్పి భారిన పడే ఉంటారు. ఈ సమస్య నుంచి తప్పించుకోవడానికి అలవాట్లలో మార్పులు చేసుకోవడం ముఖ్యం.

మన జీవనశైలిలో మార్పులు చేసుకోగలిగితే బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం పొందవచ్చు. నొప్పి తీవ్రంగా వేధిస్తున్న సమయంలో వెంటనే చికిత్స తీసుకోకపోతే దీర్ఘకాలంలో పరిస్థితి తీవ్రం అవుతుంది. యోగ, ఫిజియోథెరపీ, నొప్పినివారణలతో పాటు ఆక్యుపంక్చర్ వల్ల ఈ పరిస్థితిని నుంచి సులభంగా బటయపడవచ్చు. చాలా మంది ఈ సమస్య నుంచి విముక్తి పోందడానికి ఉపయోగించే పాపులర్ పద్దతులు. షార్ట్ టర్మ్ బ్యాక్ పెయిన్ ను విశ్రాంతి తీసుకోవడం ద్వారా లేదా మందుల ద్వారా నయం చేసుకోవచ్చు.

నొప్పి ఎక్కువ రోజులు బాధిస్తుంటే అదనపు జాగ్రత్తలతో పాటు జీవనశైలిలో మార్పులు చేయాల్పి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన నూనెలో బ్యాక్ పెయిన్ నుండి త్వరగా ఉపశమనం కలిగడానికి ఉపయోగపడుతాయి. ఈ నూనెలు కొన్నిరకాల మొక్కల నుండి ఆకులు, విత్తనాలు, పువ్వుల, పండ్లు,బెరడు నుండి తయారుచేస్తారు. వాటిని సేకరించి నొప్పి ఉన్న ప్రదేశంలో మర్ధన చేస్తే ఉపశమనం కలుగుతుంది.

Tags:    

Similar News