రోజు ఈ 7 పనులు చేయండి..

Update: 2019-06-14 13:50 GMT

ఈ రోజుల్లో ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్న సమస్య అధిక బరువు, ఈ సమస్య ప్రభావం యువతరం మీద ఎక్కువగా ఉంది. మారిన జీవనశైలి,తీసుకునే ఆహారం ఊబకాయనికి కారణమవుతుంది. . ఎక్కువగా కూర్చుని పనిచేసే ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వ్యాయామం తగ్గిపోయి ఎక్కువ మందిలో అధిక బరువు సమస్యతో సతమతమవుతున్నారు. బరువు తగ్గించుకునేందుకు ఈ క్రింది తెలిపిన చిట్కాలు పాటిస్తే శరీర బరువును అదుపులో వుంచుకోవచ్చు. అవేంటో చూద్దాం పదండి.

1 ఉదయం నిద్ర లేవగానే ఒక పండు, గ్రీన్ టీ తీసుకోవాలి.

2. ఉదయం ఎనిమిది గంటలకు అల్పహారంలో ఒక పెసరట్టు, చట్నీ, మజ్జిగ ఏదైనా జ్యూస్ తీసుకోవాలి.

3. పదకొండు గంటల తర్వాత బాదం పప్పులతో పాటు మజ్జిగ తీసుకోవాలి.

4. మధ్యాహ్నం లాంచ్‌లో సలాడ్, ఒక కప్పు బ్రౌన్ రైస్ , పప్పు, ఆకు కూర, మజ్జిగ తీసుకోవాలి

5. సాయంత్రం నాలుగు గంటలకు స్నాక్స్‌లో ఏదైనా పండు, గుప్పెడు గుమ్మడి గింజలు.

6. సాయంత్రం ఆరుగంటలకు సూప్ తాగాలి

7. రాత్రి డీన్నర్‌లో వెజిటబుల్ సలాడ్, రెండు పుల్కాలు, , వెజిటబుల్ కూర,అవసందలు, మజ్జిగ.

ఇలాంటి డైట్ రోజు ఫాలో అవ్వడం ద్వారా ఆనారోగ్యం మీ దరి చేరాదు. ఆర్యోగ్యంగా ఉంటారు.  

Tags:    

Similar News