వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి నేడు విరామం

Update: 2019-03-21 01:44 GMT

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నేడు ఎన్నికల ప్రచారానికి విరామం ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దేందుకు ఆయన ప్రచారాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో కమిటీ రూపొందించిన నివేదికను పరిశీలించిన ఆయన పలు మార్పులు సూచించారు. సామాజిక వర్గాల వారిగా చేపట్టబోయే పథకాల గురించి ప్రత్యేకంగా చర్చించారు. ఈ రోజు మరోసారి కమిటి సభ్యులతో భేటి కానున్న ఆయన తుది రూపం ఇవ్వనున్నారు. రైతులు, మహిళలు, యువత, గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను రూపొందించాలని జగన్ నిర్ణయించారు. రేపు పులివెందులలో జగన్ నామినేషన్ వేయనున్నారు. వివేకానంద హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో జగన్ నామినేషన్ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. భారీ జనసందోహం నడుమ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేసేందుకు ఏర్పాట్లు చే్స్తున్నాయి. 

Similar News