ఆ పని పూర్తి చేశాకే 2024లో ఓట్లు అడుగుతా: జగన్

Update: 2019-05-26 10:37 GMT

 ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని వదిలిపెట్టేది లేదన్నారు వైసీపీ అధినేత వై.ఎస్.జగన్. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసిన జగన్ ఏపీకి ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయని, సహకరించాలని కోరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల హామీలో భాగంగా 2024 నాటికి రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం తాను కచ్చితంగా దశల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తానని అన్నారు. ఈ పని పూర్తి చేసిన తర్వాతే తాను 2024 ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడుగుతానని జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందిస్తానని చెప్పారు. మొత్తం వ్యవస్థలన్నీ ప్రక్షాళన చేస్తాం. అవినీతి జరిగిందని తెలిస్తే కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామన‍్నారు. తాను పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కొనసాగిండంలో భాగంగానే స్నేహపూర్వకంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసినట్టు చెప్పారు జగన్. 

Similar News