భర్త వేధింపులకు మరో ఇల్లాలు ఆత్మహత్య ..

Update: 2019-06-02 03:33 GMT

భర్త వేదింపులకు తట్టుకోలేక మరో ఇల్లాలు ఆత్మహత్య చేసుకుంది . ఇక వివరాల్లోకి వెళ్తే బన్నేరుఘట్టకు చెందిన కవితకు అదే ప్రాంతానికి చెందిన అప్పు అనే యువకుడితో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో నాలుగేళ్ల క్రితం తల్లితండ్రులను ఒప్పించి మరి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్ని రోజులు కాపురం సజావుగానే సాగింది .. అ తరవాత గొడవలు మొదలయ్యాయి ..

భర్త ఉద్యోగం మానేసి దురలవాట్లకు బానిస కావడంతో కవితను రోజురోజు మానసికంగా మరియు శారీరకంగా వేధించడం మొదలుపెట్టాడు .. ఈ వేధింపులను తట్టుకోలేక కవిత శనివారం వీడియోలో భర్త పెడుతున్న వేధింపుల గురించి వివరించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కవిత తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు బన్నేరుఘట్ట పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అప్పు కోసం గాలింపు మొదలుపెట్టారు.. 

Similar News