ఇంటర్ బోర్డు నిర్వాకం.. అనామిక మళ్లీ 'ఫెయిల్'

Update: 2019-06-03 00:43 GMT

మొన్న 20 నిన్న 48 నేడు 21 ఇవీ మృతిచెందిన ఇంటర్‌ విద్యార్థిని అనామిక తెలుగు మార్కులు. అయితే బాలిక కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలపై ఇంటర్‌ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే అనామిక సోదరి దీనిని ఖండిస్తోంది. చెల్లి చేతిరాతకి, జవాబు పత్రంలోని చేతి రాతకి వ్యత్యాసముందని చెప్తోంది.తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ అనామిక కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలపై బోర్డు స్పందించింది. బోర్డు మార్కుల తప్పిదాలతో బలైన విద్యార్థిని అనామిక ఆన్షర్‌ సీట్‌ విడుద చేసింది.

ఫలితాలను మార్చి మార్చి ఇస్తూ విద్యార్థుల జీవితాలతో తెలంగాణ ఇంటర్‌ బోర్డు చెలగాటమాడుతోందంటూ అటు చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీవెరిఫికేషన్‌లో అనామికకు తెలుగులో 48 మార్కులు రాగా, ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకే తప్పు దొర్లిందని, రీవెరిఫికేషన్‌లో అనామికకు వచ్చిన మార్కులు 21 మాత్రమే అని ఇంటర్‌ బోర్డు మాటలు మార్చడంతో విద్యార్థిని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులో గాంధీ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేపట్టారు.

రీవాల్యుయేషన్‌లో విద్యార్థులు పాస్‌ అయ్యారని ప్రకటించిన గంటలోపే, తిరిగి మళ్లీ తప్పు జరిగిందని మార్కులు తప్పుగా ప్రింట్‌ అయ్యాయంటూ ఫలితలు మార్చేశారు. దీంతో ఆగ్రహించిన అనామిక తల్లిదండ్రులు, సోదరి అన్నీ పార్టీల మద్దతు కూడగట్టుకుని నిరసన చేపట్టారు. ఇదిలా ఉంటే అనామిక కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలపై ఇంటర్‌ బోర్డు వివరణ ఇస్తూ.. విద్యార్థిని ఆన్సర్‌ షీట్‌ను విడుదల చేసింది. అందులో అన్నీ తప్పులు దొర్లగా సోదరి ఉదయ అనామిక చేతిరాతను ఫోటోలను మీడియాకు విడుదల చేసింది. ఇక ఈ రెండిటిని పోల్చి నిపుణులు ఏం చెప్తారో, తెలంగాణ ఇంటర్‌ బోర్డు ఏం చెప్తుందో వేచిచూడాలి.




 


Similar News