నిరవధిక దీక్షకు దిగిన లక్ష్మణ్ ..

Update: 2019-04-29 08:31 GMT

ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని, ఇంటర్ ఫలితాల్లో అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పోలీసుల కళ్లు గప్పి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన కార్యకర్తలు, నేతలు, వివిధ విద్యార్ధి సంఘాల సమక్షంలో దీక్షకు దిగారు. ప్రభుత్వం వైఫల్యం వల్లే 23 మంది విద్యార్ధులు ఆందోళన చేసుకున్నారంటూ ఆయన ఈ సందర్భంగా ఆరోపించారు. లక్ష్మణ్ దీక్షకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.  23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, ఆ కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలుపకపోగా తూ.తూ.మంత్రంగా చర్యలు తీసుకోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్త్‌రఫ్ చేయాలని, ఇంటర్‌ ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలని లక్ష్మణ్ అన్నారు. 




 


Similar News